ఆంధ్రులను వంచించిన కేంద్రం

0
37

ప్రజలను చైతన్యపరిచేందుకు సిపిఎం ప్రచార జాతా

రాజమహేంద్రవరం, మార్చి 28 : విభజన చట్టం చట్టపరంగా రాష్ట్రానికి రావాల్సిన హామీలను అమలుచేయకుండా, ప్రత్యేక ¬దా ఇవ్వకుండా కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని మాజీ పార్లమెంట్‌ సభ్యులు, సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్ట్టర్‌ మిడియం బాబూరావు ఆరోపించారు. ప్రత్యేక ¬దా, విభజన హామీలపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు సిపిఎం ఆధ్వర్యంలో ప్రచార జాతాను చేపట్టింటి. నాలుగురోజుల పాటు నగరంలో నిర్వహించే ఈ ప్రజా చైతన్య ప్రచార జాతాను స్ధానిక నందం గనిరాజు సెంటర్‌లో బుధవారం డాక్టర్‌ బాబూరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభజన హామీలను నెరవేర్చకుండా కేంద్రం గత నాలుగేళ్ళగా దాటవేత వైఖరిని అవలంభించిందని ఆరోపించారు. చివరి బడ్జెట్‌లోనైనా రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ఎదురుచూసినప్పటికీ మొండి చేయి చూపించిందన్నారు. ప్రత్యేక ¬దాతో పాటు విభజన చట్టంలోని హామీలు ఏవీ కూడా అమలు చేయలేదన్నారు. ప్రత్యేక రైల్వేజోన్‌, వెనుకబడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ఆర్ధిక ప్యాకేజీ, కేంద్ర ప్రభుత్వం సంస్ధల ఏర్పాటు, దుగ్గరాజుపట్నం ఫోర్ట్‌, కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా కేంద్రం మోసం చేసిందన్నారు. అటు కేంద్రంతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలను వంచించిందన్నారు. గత నాలుగేళ్ళగా విభజన హామీలు ఏవీ కూడా అమలుకానప్పటికీ కేంద్రాన్ని నిలదీయకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతూ వచ్చిందన్నారు. చివరి బడ్జెట్‌లో కూడా కేంద్రం న్యాయం చేయకపోవడంతో వామపక్షా పార్టీలు ఇచ్చిన బంద్‌ పిలుపునకు అన్ని పక్షాలు మద్దతు తెలిపాయని, చివరికి అధికార టిడిపి కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టిందన్నారు. కేంద్రం ఇప్పటికైనా కళ్ళు తెరిచి రాష్ట్రానికి న్యాయం చేయాలన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్‌ మాట్లాడుతూ విభజన చట్టాలను అమలు చేయకుండా కేంద్రం ఏవిధంగా మోసం చేసిందో, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను ఏవిధంగా మభ్యపెట్టిందో ప్రజలకు వివరిస్తూ ఈ ప్రచార జాతా సాగుతుందన్నారు. నాలుగురోజుల పాటు నగరంలోని అన్ని డివిజన్‌లలో ఈ జాతా సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎస్‌ఎస్‌ మూర్తి, పోలిన వెంకటేశ్వరరావు, టి సావిత్రి, వేణు, రాజులోవ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here