రాజమహేంద్రవరంలో ‘కంపాస్‌’ మెడికల్‌ స్టోర్స్‌

0
73

ఎ.వి.ఎ రోడ్‌, కంబాలచెరువు వద్ద రేపు ప్రారంభం

రాజమహేంద్రవరం, మార్చి 31: మందుల రిటైల్‌ చెయిన్‌ స్టోర్స్‌ వ్యాపారంలో అడుగుపెట్టిన ”కంపాస్‌” సంస్ధ ముందుగా రాజమహేంద్రవరంలో రెండు షాపులను ప్రారంభిస్తుందని కంపాస్‌ మేనేజింగ్‌ డైరక్టర్‌ డాక్టర్‌ గన్ని సందీప్‌ తెలిపారు. ఎవి అప్పారావు రోడ్డులో హెచ్‌ పి పెట్రొలు బంకు పక్కన, కంబాల చెరువు వద్ద ఎస్‌ బి ఐ పక్కన ఏర్పాటు చేసిన షాపులు రేపు సాయంత్రం ప్రారంభమౌతున్నాయని చెప్పారు. స్ధానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్‌ సందీప్‌ మాట్లాడుతూ శరీర సమస్యలపై వైద్యులు సూచించే మందులు మాత్రమేకాక, ఫిట్‌ నెస్‌, న్యూట్రిషన్‌, డయాబెటీస్‌, సమ్మర్‌ కేర్‌, హైజీన్‌, వుమెన్‌ నీడ్స్‌, ఓల్డ్‌ ఏజ్‌ నీడ్స్‌, అన్ని వయసుల వారి వెల్‌ నెస్‌ మొదలైన అన్ని రకాల పర్సనల్‌ కేర్‌ ప్రొడక్టులు కంపాస్‌ స్టోర్స్‌ లో లభిస్తాయని వివరించారు. ప్రపంచ స్ధాయి వైద్యవసతులను, నైపుణ్యాలను జిఎస్‌ఎల్‌ మెడికల్‌ కాలేజి ద్వారా నగరానికిి తీసుకు వచ్చిన డాక్టర్‌ గన్ని భాస్కరరావు సారధ్యంలోని సంస్ధల ప్రేరణగా క్వాలిటీ సర్వీసులు, ప్రొడక్ట్‌లను చౌక ధరలకే అందచేయడం తమ లక్ష్యమని, అన్ని టాబ్లెట్ల మీదా 15% డిస్కౌంటు, లోషన్లు క్రీములపై 10% వరకూ డిస్కౌంటు ఇస్తామని తెలిపారు. జిఎస్‌ఎల్‌ గ్రూపు నుంచి వచ్చిన రెండోతరమైన యువతరం నెలకొల్పిన ”కంపాస్‌” స్వతంత్రంగా పనిచేసే స్టాండ్‌ ఎలోన్‌ కంపెనీ అని, దేనికీ అనుబంధం కాదని ఒక ప్రశ్నకు సమాధానంగా డాక్టర్‌ సందీప్‌ చెప్పారు. భవిష్యత్తులో స్వయంగా మందులు తయారు చేసే ఆలోచనకూడా కంపాస్‌కు వుందని మరో ప్రశ్నపై ఆయన సమాధానం ఇచ్చారు. కంపాస్‌ డైరక్టర్‌ వి హరీష్‌, జి.ఎస్‌.ఎల్‌. మెడికల్‌ విద్య, వైద్య సంస్ధల కో ఆర్డినేటర్‌ పెద్దాడ నవీన్‌ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here