తెలుగోడి సత్తా చూపిద్దాం

0
24

నమ్మించి మోసం చేసిన బిజెపికి బుద్ది చెబుదాం- విజయనగరంలో గన్ని కృష్ణ

రాజమహేంద్రవరం, మార్చి 31 : రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వంపై యుద్దం ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు పార్టీ శ్రేణులు అండగా నిలవాలని, పార్టీ సూచించే విధంగా కార్యక్రమాలు తలపెట్టాలని గుడా చైర్మన్‌, విజయనగరం పార్లమెంట్‌ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త గన్ని కృష్ణ సూచించారు. ఈరోజు విజయనగరంలో జరిగిన సిటీ నియోజకవర్గ పార్టీ సమావేశానికి ముఖ్య అతిధిగా గన్ని కృష్ణ హజరయ్యారు. ముందుగా ఎన్‌.టి.ఆర్‌. చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా గన్ని కృష్ణ మాట్లాడుతూ మిత్రపక్షంగా ఉండి నాలుగేళ్ళు పాటు నమ్మించి మోసం చేసిన కమలనాధుల మోసాలను ప్రజలకు వివరించాలని సూచించారు.విభజన కారణంగా నష్టపోయిన రాష్ట్రానికి మేలు చేసే రధసారధిగా ప్రజలు చంద్రబాబుపై ఎంతో నమ్మకంతో ఓట్లేసారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్రంలో ఆర్దికలోటు ఉన్న అభివృధ్ది, సంక్షేమ పధకాల అమలులో రాజీ పడకుండా కృషి చేస్తున్నారని వివరించారు. అయితే కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో ఉన్న అంశాలు అమలు చేయకపోగా ప్రత్యేక హోదాను ప్రకటించకపోవడం దారుణమన్నారు. చివరికి బడ్జెట్‌లో కూడా మొండి చెయ్యి చూపడంతో ఎన్‌.డి.ఎ. కూటమి నుంచి బయటకు కేంద్రంపై పోరాటం చేస్తున్నారని, పార్టీ శ్రేణులు, ప్రజలు ఆయనకు అండగా నిలవాలని, తెలుగోడి సత్తా ఏంటో చూపించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here