ఇవీ మా సమస్యలు… పరిష్కారం చూపండి

0
36

సబ్‌ కలెక్టరేట్‌లో ప్రజావాణిలో ప్రజల వేడుకోలు

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 2 : ప్రభుత్వ పథకాలు అర్హులైనవారికి అందే విధంగా చర్యలు తీసుకుంటామని రాజమహేంద్రవరం సబ్‌-కలెక్టర్‌ సి.ఎం.సాయికాంత్‌వర్మ తెలిపారు. తన కార్యాలయంలో ఈరోజు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి విజ్ఞాపనలు స్వీకరించారు. ఈ సందర్బముగా ఆయన మాట్లాడుతూ రేషన్‌ కార్డులు లేనివారు దరాఖాస్తులు చేసుకుంటే పరిశీలించి తప్పనిసరిగా రేషన్‌కార్డులు అందే విధంగా చూస్తామని తెలిపారు. ఫింఛనులు లేనివారికి అర్హత ఉంటే తప్పనిసరిగా ఫింఛనులు అందిచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇండ్లు మంజూరుచేయాలని చాలమంది దరఖాస్తులు అందజేస్తున్నారని, అయితే నగర పరిధిలో స్ధలాలు అందుబాటులో లేకపోవడం వలన గ్రామీణ ప్రాంతంలో ఇండ్లు నిర్మించడం జరుగుతుందని, అర్హత గల వారందరికి దశల వారిగా ఇవ్వడం జరుగుతుందని అన్నారు. క్వారీ ఏరియాకు చెందిన సి.గంగాభవాని,జాంపేటకు చెందిన మహమ్మద్‌ హాజిరాబేగం, మదన్‌సింగ్‌పేటకు చెందిన అబిడబేగం,మున్సిపాల్‌ కాలనీకి చెందిన యు.దుర్గాలక్ష్మీ, రాజమహేంద్రవరం రూరల్‌ మండలం కాతేరు గ్రామానికి చెందిన బి.సువర్ణ, ధవళేశ్వరం గ్రామానికి చెందిన ఎన్‌.పద్మావతి ఇండ్ల మంజూరు కొరకు దరఖాస్తులను సబ్‌-కలెక్టర్‌కు అందజేశారు. వితంతు ఫింఛనులు ఇప్పించాలని లాలచెరువు ప్రాంతానికి చెందిన ఎం.ఛాయదేవి, సి.నాగమణి, జి.అచ్చమాంబ విజ్ఞప్తి చేశారు. స్ధానిక 41వ డివిజన్‌ కార్పోరేటర్‌ మర్రి దుర్గాశ్రీనివాస్‌ కోటిలింగాల ఘాట్‌, పుష్కరఘాట్‌లో స్నానం అచరించడానికి వచ్చిన వారు నది ప్రాంతంలో లోతు ఎక్కువగా ఉన్న కారణంగా మృత్యువాత పడుతున్నారని, తక్షణమే ఈ ప్రాంతంలో ప్రమాద నివారణకు చర్యలు తీసుకోవాలని సబ్‌-కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం తాహశిల్దార్‌ టి.రాజేశ్వరరావు, హౌసింగ్‌ ఇ.ఇ. జి.సోములు, డివిజనల్‌ పంచాయితీ అధికారి ఎం.వరప్రసాద్‌ ఆరోగ్యశాఖ అధికారిణి పి.కోమలి, మున్సిపాల్‌ కార్యాలయ అధికారి బి.వి.రామారావు. బి.సి.వెల్ఫేర్‌ అధికారిణి సి.హెచ్‌.నాగలక్ష్మి, సోషల్‌ వెల్ఫేర్‌ అధికారి కె.డేవిడ్‌ రాజు, సివిల్‌ సప్లయి అధికారి కె.వి.యస్‌.ఎం.ప్రసాద్‌ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here