పద్మవ్యూహాన్ని చంద్రబాబు చేధిస్తారు

0
38

45 వ డివిజన్‌లో దళితతేజం-తెలుగుదేశంలో గన్ని కృష్ణ

రాజమహేంద్రవరం,ఏప్రిల్‌ 4 : ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించిన ఏకైక పార్టీ తెలుగు దేశం పార్టీ మాత్రమే అని గూడా చైర్మన్‌ గన్ని కృష్ణ పేర్కొన్నారు. స్థానిక 45 వ డివిజన్‌ ఆనంద్‌ నగర్‌లో దళితరత్న కాశి నవీన్‌ కుమార్‌ అధ్యక్షతన ఈరోజు జరిగిన దళిత తేజం -తెలుగుదేశం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దళితులకు ఎన్నో సంక్షేమ పథకాలను తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు. దళితులు తమ వెంటే ఉన్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని, అందులో నిజం లేదన్నారు. రాజకీయ ప్రయోజనాలే గాని రాష్ట్ర అభివ ద్ది ఆ పార్టీకి అక్కర్లేదని, ఆ పార్టీకి ఇపుడు జనసేన, బిజెపి జత కలిశాయని విమర్శించారు.రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పద్మవ్యూహంలో అభిమన్యుడిలా పోరాటం చేస్తున్నారని, ఆనాడు అభిమన్యుడు పద్మవ్యూహాన్ని చేధించలేకపోయినా నేడు ప్రజల శ్రేయస్సును నిరంతరం కాంక్షించే చంద్రబాబు మాత్రం అజేయంగా పద్మవ్యూహాన్ని ఛేదించుకుని బయటకు వస్తారని గన్ని అన్నారు. ప్రతి శుక్రవారం న్యాయస్థానంలో చేతులు కట్టుకునే నిలబడే ప్రతిపక్ష నాయకుడి మాయ మాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలకు హితవు పలికారు. జగన్‌ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం పరువు పోవడమే కాకుండా, పరిశ్రమలు స్థాపించడానికి కూడా ఎవ్వరు ముందుకు రారని అన్నారు. రాష్ట్ర శ్రేయస్సు ప్రజల భవిష్యత్తు కోసం నిరంతరం పాటుపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని తిరిగి గెలిపించాలని ప్రజల్ని కోరారు. ఓటును నమ్ముకున్న చంద్రబాబును గెలిపించాలని, ఓటును అమ్ముకునే జగన్‌ని తరిమి కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాపు కొర్పొరేషన్‌ డైరెక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడు మాట్లాడుతూ స్వతంత్రం వచ్చిన తరువాత అనేక ప్రభుత్వాలు దళితుల శ్రేయస్సు కోసం అనేక సంక్షేమ పథకాలు అమలుచేశాయని, దళితులను అలక్ష్యం చేసిన ప్రభుత్వాలు ఎక్కువ కాలం మనుగడ సాగించలేవని అన్నారు. టీడీపీ ప్రభుత్వం దళితులకు పెద్ద పీట వేస్తోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దళితులకు అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నారని అన్నారు. దళితుల్లో సామాజిక పరంగా చైతన్యం తీసుకు వచ్చి అగ్రవర్ణాలతో సమానంగా జీవించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారని అన్నారు. అనంతరం డివిజన్‌లోని దళితులతో సహపంక్తి అల్పాహారాన్ని సేవించారు. డివిజన్‌ అంతా కలియతిరిగి దళితుల సమస్యలు అడిగి తెలుసుకుని సాధ్యమైనంత వరకు వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ కోరిమిల్లి విజయ శేఖర్‌, కో ఆప్షన్‌ సభ్యురాలు కప్పల వెలుగుకుమారి, టీడీపీ డివిజన్‌ ఇంచార్జి సుధాకర్‌, ఈతలపాటి క ష్ణ, కవులూరి వెంకటరావు, ఆర్‌.సత్యనారాయణ, కొమ్మర్తి బాబ్జి, జాల మదన్‌, పేయాల శ్రీను, మోతా నాగలక్ష్మి, బొత్స శ్రీను తదితరులు పాల్గున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here