హొదాకోసం జక్కంపూడి బ్రదర్స్‌ ఒకరోజు దీక్ష

0
42

పుట్టినరోజు వేడుకలకు దూరంగా గణేష్‌

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 4 : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హొదా కల్పించాలని డిమాండ్‌ చేస్తూ స్ధానిక కంబాలచెరువు జక్కంపూడి విగ్రహం వద్ద వైఎస్సార్‌ కాంగ్రెస్‌ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా, యువ నాయకుడు జక్కంపూడి గణేష్‌లు ఒకరోజు నిరాహార దీక్ష నిర్వహించారు. రెండేళ్ళ క్రితం ప్రత్యేక హొదాకోసం చేపట్టిన బంద్‌ సందర్భంగా చోటుచేసుకున్న సంఘటనలో జక్కంపూడి రాజా, గణేష్‌లతో పాటుగా కేసులు ఎదుర్కొని, నెలరోజుల పాటు నగర బహిష్కరణకు గురైన వారంతా ఒకరోజు నిరాహార దీక్షలో పాల్గొన్నారు. పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండి జక్కంపూడి గణేష్‌ ఈ నిరాహార దీక్షలో పాల్గొన్నారు. నిరాహార దీక్ష శిబిరాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సిజిసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కందుల దుర్గేష్‌, పార్టీ నగర కోఆర్డినేటర్‌ రౌతు సూర్యప్రకాశరావు, రూరల్‌ కోఆర్డినేట్‌ ఆకుల వీర్రాజు, వైసిపి ఫ్లోర్‌ లీడర్‌ మేడపాటి షర్మిలరెడ్డి, మాజీ ఫ్లోర్‌ లీడర్‌ పోలు విజయలక్ష్మి, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, విద్యార్ధులు సందర్శించి జక్కంపూడి సోదరులకు సంఘీభావం తెలియజేసారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రత్యేక హొదాకోసం పోరాటం చేస్తే నాడు జైళ్ళకు పంపిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నేడు యుటర్న్‌ తీసుకుని ¬దాకోసం పోరాడుతున్నామంటూ మరోసారి ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. హొదాకోసం పోరాటంలో జైళుకు వెళ్ళిన కార్యకర్తల త్యాగాలను అభినందించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే తొలినాటి నుంచి హొదా యొక్క ఆవశ్యకతను గుర్తించి పోరాటం చేస్తుందన్నారు. ప్రత్యేక హొదాకోసం తమ పార్టీ ఎంపిలు పార్లమెంట్‌లో పోరాటం చేస్తున్నారన్నారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టడంతో పాటుగా, హొదాను కోరుతూ ఎంపీలు రాజీనామాకు సిద్ధమయ్యారన్నారు. రాజీనామా చేయడంతో పాటు ఢిల్లీలో ఆమరణ దీక్షకు ఎంపిలు అంతా సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రత్యేక హొదా సాధించేందుకు రాజీలేని పోరాటం సాగిస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాష్ట్ర ప్రజలంతా అండగా నిలవాలని కోరారు. సుంకర చిన్ని, కార్పొరేటర్‌ బొంత శ్రీహరి, గుర్రం గౌతమ్‌, ఆరిఫ్‌, మరుకుర్తి కుమార్‌ యాదవ్‌, కోడికోట సత్తిబాబు, కరుణామయుడు శ్రీను, నిడిగట్ల బాబ్జి, కొమ్ముల సాయి, శివ తదితరులు దీక్షలో కూర్చున్నారు. దీక్ష శిబిరాన్ని మార్తి నాగేశ్వరరావు, మార్తి లక్ష్మి, ఉప్పాడ కోటరెడ్డి, పోలు కిరణ్‌రెడ్డి, కాటం రజనీకాంత్‌, కానుబోయిన సాగర్‌, పెద్దఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్ధులు, నగర ప్రజలు సందర్శించి మద్దతు తెలిపారు. మాజీ పార్లమెంట్‌ సభ్యులు ఉండవల్లి అరుణకుమార్‌ దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిజేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here