జగ్జీవన్‌రామ్‌ జీవితం స్ఫూర్తిదాయకం

0
29

జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆకుల, గుడా చైర్మన్‌ గన్ని

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 5 : దేశ మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగజ్జీవనరామ్‌ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో పాటుపడ్డారని నగర శాసనసభ్యులు డాక్టర్‌ ఆకుల సత్యనారాయణ తెలిపారు. జగ్జీవన్‌రామ్‌ 110 వ జయంతి సందర్భంగా చర్చిపేట, మేదరపేటలలోని జగజ్జీవనరామ్‌ విగ్రహాలకు ఈరోజు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా జగ్జీవన్‌రామ్‌ జీవిత విశేషాలను వివరిస్తూ బీహర్‌లోని షాబాద్‌ జిల్లాలో 1908వ సంవత్సరంలో జన్మించిన ఆయన 1930 సంవత్సరంలో సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని 27ఏళ్ల వయస్సులో బీహార్‌ శాసనమండలి సభ్యునీగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారన్నారు. ఆ తర్వాత జాతీయ నేతగా ఎదిగి కేంద్రంలో వ్యవసాయ, ఆర్థిక, కార్మిక, ఉపాధి,పునరావాసం, తంతితపాలా,రవాణా, రైల్వేశాఖ మంత్రిగా పలు పదవులు చేపట్టి పేదలు,దళితుల అభ్యున్నతికి ఎంతో పాటుపడ్డారని తెలియజేశారు. జగ్జీవన్‌రామ్‌1977 మార్చి 23న భారతదేశ ఉప ప్రధానిగా భాద్యతలు చేపట్టి దేశ స్వయం సమృద్దికి ఎంతగానో కృషిచేశారని, నిజాయితీ,అంకితభావం,సేవాతత్పరతలే కవచాలుగా చేసుకుని ఆయన ఆదర్శంగా నిలిచారన్నారు. అందుకే ఆయన దేశ ప్రజల గుండెలలో మహానీయుడుగా నిలిచిపోయారని, భారతదేశ అభ్యున్నతికి ఎంతగానో పాటుపడ్డారని అన్నారు. గుడాచైర్మన్‌ గన్నికృష్ణ చర్చిపేటలో జగజ్జీవనరామ్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బాబు జగజ్జీవనరామ్‌ దళితులు, పేదల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాళం పద్మశ్రీ, అడ్డాలఆదినారాయణ, కాశీనవిన్‌కూమార్‌, కాటం రజనీకాంత్‌, మోర్త శివ, యేసు, పి.విజయరాజు,డేవిడ్‌రాజు,అల్లం శ్రీను, మోర్త కుమార్‌, ముప్పిడి నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here