బాబూ జగజ్జీవన్‌రామ్‌కు ఆదిరెడ్డి వాసు నివాళి

0
33

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 5 : సంఘ సంస్కర్త, కుల వివక్ష రహిత ఉద్యమకర్త, మాజీ ఉప ప్రధాని బాబూ జగజ్జీవన్‌రామ్‌ 110వ జయంతి సందర్భంగా పలుచోట్ల ఉన్న ఆయన విగ్రహాలకు టిడిపి యువ నాయకులు ఆదిరెడ్డి వాసు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాత రామవరం, ఆంధ్రా నగర్‌, సిమెంటరీపేట, మదన్‌సింగ్‌పేట, చర్చిపేట, గోరక్షణపేటల్లో ఉన్న విగ్రహాలకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఆయన వెంట వెంట్రపాటి వీర్రాజు, తుత్తరపూడి రమణ, ఈతలపాటి కృష్ణ, అలజంగి చిన్ని, కడితి జోగారావు, బొచ్చా శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here