ఆర్యాపురం బ్యాంక్‌ లోన్‌ ఖాతాదారులకు బీమా సొమ్ము చెల్లింపు

0
79

ఆర్యాపురం బ్యాంక్‌ లోన్‌ ఖాతాదారులకు బీమా సొమ్ము చెల్లింపు (18-1)

రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 18 : ది ఆర్యాపురం అర్బన్‌ బ్యాంక్‌ జెఎన్‌ రోడ్డు బ్రాంచిని పార్లమెంట్‌ సభ్యులు మురళీమోహన్‌ ఇటీవల సందర్శించారు. బ్యాంక్‌ లోన్‌ ఖాతాదారుడైన కుసుమ సువర్ణ లతకు యూని హోమ్‌ ఇన్సూరెన్స్‌ కింద రూ. 3,99,695, మరో ఇద్దరికి యాక్సిడెంట్‌ ఇన్సూరెన్స్‌గా లక్ష రూపాయలు చొప్పన ఎం.పి. మురళీమోహన్‌ చేతుల మీదుగా చెక్‌లను అందజేశారు. ఆర్ధికంగా వెనుకబడిన పిల్లలకు చదువుకునే నిమిత్తం బ్యాంక్‌ చైర్మన్‌ చల్లా శంకరరావు గౌరవ వేతనం నుంచి ఇద్దరు విద్యార్ధినులకు రూ. 30 వేల ఆర్ధిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ అయ్యల కృష్ణ గంగాధరరావు, డైరక్టర్లు నండూరి వెంకటరమణ, నందం బాల వెంకట్‌ కుమార్‌రాజా, పోలాకి పరమేశ్వరరావు, పిల్లి శ్యామ్‌కుమార్‌, మహ్మద్‌ అబ్ధుల్‌ ఫహీమ్‌, సూరంపూడి శ్రీహరి, ముళ్ళ మాధవరావు, యెనుముల రంగారావు, బొబ్బిలి వీర వెంకట సత్యనారాయణమూర్తి, సింగంపల్లి వెంకట రామకృష్ణ, సెక్రటరీ జి.సుధాకరరావు, తెదేపా నాయకులు మజ్జి రాంబాబు పాల్గొన్నారు.