విశ్వశాంతిని కోరుతూ అతిరాత్రం మహాయాగం

0
61

14 నుండి 25 వరకు పెద్దాపురంలో నిర్వహణ

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 7: సకల విశ్వశాంతిని, సమస్త జీవరాశి, ప్రజాహితాన్ని కాంక్షిస్తూ భారతదేశంలో అరుదుగా జరిగే అతిరాత్రం మహాయాగంను ఈ నెల 14 నుండి 25 వరకు పెద్దాపురంలో నిర్వహిస్తున్నట్లు యాగం కార్య నిర్వాహకులు తెలిపారు. స్ధానిక ప్రెస్‌ క్లబ్‌లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్వాహకులు కె.పి.రాజశేఖర శర్మ, కేసాప్రగడ సత్యనారాయణ మాట్లాడుతూ కె.హెచ్‌.ఎస్‌.సేవా ట్రస్ట్‌ నిర్వాహణలో 16 స్మార్త యాగములతో పాటు 2012లో భద్రాచలంలో అతిరాత్రం ఉత ్కష్ట సోమయాగం, 2013లో మురమళ్ళలో అతిరుద్రం మహాయాగము, 2015లో కర్నూలులో అప్తోర్యామం మహా సోమయాగం, 2017లో తెలంగాణలోని యాదాద్రిలో 126 రోజులపాటు శ్రీ పంచాయతన సహిత అయుత శ్రీ మహా విష్ణుయాగం ఇత్యాది 21 మహాయాగములను నిర్వహించి విశేష బహుయజ్ఞకర్తగా పేరొందిన హైదరాబాద్‌ వాస్తవ్యులు కేసాప్రగడ హరిహరనాధ శర్మ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. పెద్దాపురంలోని పాండవుల మెట్ట దిగువున ఉన్న సువిశాల ప్రాంగణంలో అతిరాత్రం యాగం జరుగుతుందన్నారు. లోకకల్యాణం, పర్యావరణ పరిరక్షణ, విపత్తుల నిర్వాహణ,మానవ సమాజంలో అన్ని జాతులు, మతాలు, కులాలు, వర్గాలు మధ్య పరస్పర సధ్బావన , సౌభ్రాత త్వాలను నెలకొల్పాలన్న పరమ లక్ష్యంతో ఈ మహా యాగాలను తలపెట్టినట్లు వారు తెలిపారు. ఈ మహా సోమయాగానికి కర్నాటక, శివమొగ్గ,మత్తూరు అగ్రహారానికి చెందిన నిత్యాగ్ని హోత్రులు బహ్మశ్రీ కిరణ అవధాని సోమయాజి దంపతుల యాజమానత్వంలో బ్రహ్మశ్రీ కేశవ అవధాని అధ్వర్యంలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 70మంది చతుర్వేద శ్రౌత పండితులతో అత్యంత అరుదుగా ఈ యాగం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ యాగాన్ని దశరధ మహారాజు, శ్రీరామచంద్రుడు, హరిశ్చం ద్రుడు, సగరుడు, సమస్త భూమండలాన్ని పరిపాలించిన చక్రవర్తులు ఆచరించారని తెలిపారు. వేలమంది సందర్శకులు సౌకర్యంగా కూర్చొనిఈ ఆధ్యాత్మిక మహా క్రతువులను తిలకించేందుకు తగిన వసతులు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇంత గొప్ప మహా యాగాన్ని ఈ జిల్లాలో నిర్వహించడం ప్రజల అద ష్టమని నగర ప్రముఖులు తోట సుబ్బారావు, గంటా సత్యనారాయణ, కాకినాడకు చెందిన దుర్గ సూర్యారావు అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here