1000 మందితో కంపాస్‌ 4కె రన్‌ విజయవంతం

0
41

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 7 : ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ”కంపాస్‌ ఫార్మసీ” సంస్ధ శనివారం ఉదయం నిర్వహించిన నాలుగు కిలోమీటర్ల పరుగు పోటీ రాజమహేంద్రవరంలో విశేష ఆకర్షణగా వుంది. ఉదయం ఆరున్నరకు పుష్కర ఘాట్‌ వద్ద నాలుగు దశలుగా కార్యక్రమం మొదలైంది. ముందుగా నడిచేవారు, తరువాత ౖ సైకిలిస్టులు,ఆ తరువాత 12 బుల్లెట్‌ మోటార్‌ సైకిళ్ళపై ఔత్సాహికులు చివరిగా పరుగుపోటీలో వున్నవారు 4 కె రన్‌లో పాల్గొన్నారు. వీరంతా దేవీచౌక్‌,ఉమెన్స్‌ కాలేజి మీదుగా ఎవి అప్పారావు రోడ్‌లోని కంపాస్‌ మందుల షాపు వద్దకు చేరుకోవడంతో కార్యక్రమం పూర్తయింది. పరుగుల పోటీలో నర్సింగ్‌ కాలేజి విద్యార్ధి శ్రీహరి మొదటి బహుమతిని పోలీసు డిపార్టుమెంటు ఉద్యోగి వాసు రెండవ బహుమతిని, ఫిజియో ధెరపీ విద్యార్ధి సూర్యతేజ మూడవబహుమతిని గెలుచుకున్నారు. విజేతలకు డాక్టర్‌ గన్ని భాస్కరరావు మెడల్స్‌ అందజేశారు. ఇందులో 72 ఏళ్ల డాక్టర్‌ టి సత్యనారాయణ మొదలు 6 ఏళ్ళ ఏరుకొండ రిధి వరకూ వేర్వేరు వయసుల వారు యధాశక్తి అడుగులు వేయడం విశేషం. అన్ని ఈవెంట్లలోనూ దాదాపు 1000 మంది పాల్గొన్నారు. డాక్టర్‌ గన్ని భాస్కరరావు జెండా ఊపి పరుగు పోటీని ప్రారంభించారు. జిఎస్‌ఎల్‌ మెడికల్‌ కాలేజి సూపరింటెండెంట్‌ బ్రిగేడియర్‌ డాక్టర్‌ టివిఎస్‌ పి మూర్తి విజిల్‌ ఊది ఇతర కార్యక్రమాలను ప్రారంభిచారు. పరుగులో పాల్గొన్న విజేతలకే బహుమతులు ఇచ్చారు. నడక, సైకిలింగ్‌ బైక్‌ రైడింగులను పోటీలుగా పరిగణించలేదని అయినా పాల్గొన్న ప్రతి ఒక్కరికీ టిషర్టులు ఉచితంగా ఇచ్చామని ఈవెంటు నిర్వహణ కమిటీ తరపున భాగ్యరఖ సిన్హా, ఆక తి,ఉమ వివరించారు.వారంక్రితమే మార్కెట్‌ లోకి వచ్చిన కంపాస్‌ కు లభిస్తున్న ఆదరణకు ఆసంస్ధ డైరక్టర్‌ వి హరీష్‌ క తజ్ఞతలు తెలియజేస్తూ నగరంలోని తమ రెండు బ్రాంచిలూ నాణ్యమైన ఉత్పత్తులు, సేవలకే కట్టుబడి వుంటామని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here