హోదా వచ్చే వరకు పోరాడతాం

0
57

రౌతు ఆధ్వర్యంలో బిఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం వద్ద వైకాపా ధర్నా

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 9 : వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ కేంద్ర కార్యాలయం పిలుపు మేరకు అర్బన్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో సిటీ కో-ఆర్డినేటర్‌ రౌతు సూర్యప్రకాశరావు అధ్యక్షతన కోటగుమ్మం సెంటర్‌లో బిఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫీస్‌ వద్ద సుమారు గంటన్నపాటు ప్రత్యేకహోదాకై విభజన చట్టంలోని హామీలను అమల అమలుకోసం నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్రప్రభుత్వం ప్రత్యేక హోదా ప్రకటించేవరకు ఏదో ఒక రూపంలో నిరసన కార్యక్రమం చేపడతామని రౌతు తెలిపారు. ఒకపక్క పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రత్యేక హోదాకై నిరంతరం అలుపెరుగని పోరాటం చేస్తున్నారన్నారు. వైకాపా చిత్తశుద్దిగా, విశ్వాసంతో పోరాటం చేస్తుందని రౌతు అన్నారు. కార్యక్రమంలో ఫ్లోర్‌ లీడర్‌ మేడపాటి షర్మిలారెడ్డి, మాజీ ఫ్లోర్‌ లీడర్‌ పోలు విజయలక్ష్మి, పోలు కిరణ్‌మోహన్‌రెడ్డి, పతివాడ రమేష్‌ బాబు, లంకసత్యనారాయణ, కానుబోయిన సాగర్‌, కార్పొరేటర్లు బొంత శ్రీహరి, మజ్జి నూకరత్నం, ఈతకోట బాపన సుధారాణి, పిల్లి నిర్మల, నాయకులు మరుకుర్తి కుమార్‌యాదవ్‌, పెదిరెడ్ల శ్రీనివాస్‌,మజ్జి అప్పారావు లంక సత్యనారాయణ, కాటం రజనీకాంత్‌, నీలి ఆనంద్‌, వంకాయల సత్తిబాబు, మైనార్టీసెల్‌ రబ్బాని, నయీమ్‌, బాషా, ఆరీఫ్‌ ఖాన్‌, ఉప్పాడ కోటరెడ్డి, మాసా రామ్‌జోగ్‌, కందిరాఘవ, సబ్బరపు సూరిబాబు, మోహిద్దీన్‌ పిచ్చాయ్‌, సంకిస రవి, ఎం.పుష్పరాజ్‌, కట్టా సూర్యప్రకాష్‌, బురిడిత్రిమూర్తులు, చెక్కా వెంకటేశ్వరరావు, జగపతి, చెక్కా నవీన్‌ తదితరులు దీక్షకు సంఘీభావం తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here