యువకుడి హత్యకేసులో ఆరుగురి ఆరెస్టు

0
38

నలుగురి కోసం గాలింపు.. డిఎస్పీ నాగరాజు

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 9 : రాజానగరం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కొంతమూరు జంగాల కాలనీకి చెందిన ఎస్‌కె నూర్‌ మహ్మద్‌ హత్య కేసులో ఆరుగురు వ్యక్తుల్ని పోలీసులు ఆరెస్టు చేసారు. దీనికి సంబంధించిన వివరాలను తూర్పు జోన్‌ డిఎస్పీ యు.నాగరాజు ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 2016లో జరిగిన ఒక హత్యకు సంబంధించిన కేసులో ఎస్‌కె నూర్‌ మహ్మద్‌ ముద్దాయిగా ఉండగా ఈ ఏడాది మార్చి 30వ తేదీన ఈ కేసును కొట్టివేయడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో జంగాలకాలనీకి వెళ్లి నూర్‌ మహ్మద్‌ అందరితో గొడవలు పడుతున్నట్టు అదే క్రమంలో ఊబా గణేష్‌తో నూర్‌ మహ్మద్‌ జంగాల కాలనీకి వెళ్లి గొడవ పడినట్టు అక్కడ పోసుపో రాజు తమ్ముడు ప్రేమ్‌కుమార్‌ను కొట్టడంతో వారు అతడిని ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఊబా గణేష్‌, పోసుపో రాజు, మిరియాల శివప్రసాద్‌, బత్తుల సత్తిబాబు, పోసుపో మోషే, ఊబా నారాయణ, పోసుపో ప్రేమ్‌కుమార్‌, వేమగిరి హరీష్‌, వేమగిరి పండు, కొల్లి ధర్మతేజలతో కుట్రపన్ని 30వ తేదీ రాత్రి కొంతమూరు ఎస్తేరు రాణి చర్చ్‌ ప్రాంగణంలోకి రప్పించి ఇనుక రాడ్లు, ప్లాస్టిక్‌ ఫైటర్‌ రాడ్‌తో తలపై కొట్టి చంపేసినట్టు తెలిపారు. నలమాటి నాగేంద్రను చంపిన హత్యకేసులో కూడా అతడికి శిక్ష పడకపోవడంతో వీరు అతడిపై పగ తీర్చుకోవాలని భావించి ఈ విధంగా హత్యకు పాల్పడ్డారని వివరించారు. వీరితో ఇంకా నలుగురు నిందితులు పరారీలో ఉన్నారని వారిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని డిఎస్పీ నాగరాజు తెలిపారు. సమావేశంలో రాజానగరం సిఐ వరప్రసాద్‌, ఇతర సిబ్బంది ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here