దళిత, మైనార్టీలకు అండగా కాంగ్రెస్‌

0
62

అంబేద్కర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం

ఎస్సీఎస్టీమైనార్టీలపై దాడులకు నిరసన

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 9 : దేశంలోని దళిత, మైనార్టీలకు కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు పంతం నానాజీ పేర్కొన్నారు. దేశంలో దళిత, మైనార్టీలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ, ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీల పిలుపుమేరకు జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు పంతం నానాజీ ఆధ్వర్యంలో సోమవారం స్ధానిక గోకవరం బస్టాండ్‌ వద్దగల అంబేద్కర్‌ విగ్రహానికి కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు క్షీరాభిషేకం చేసారు. అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలువేసి జోహార్లు అర్పించారు. అనంతరం నిరసన ప్రదర్శన చేసారు. శాంతి, అహింస వర్ధిల్లాలి, దళిత, మైనార్టీలపై దాడులను నిరోదించాలి, జోహార్‌ బిఆర్‌ అంబేద్కర్‌ అంటూ నినాదాలు చేసారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ పాలనలో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు. దళిత, మైనార్టీలపై యదేచ్ఛగా దాడులు జరుగుతున్నాయన్నారు. దేశంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఎస్సీఎస్టీమైనార్టీలను కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. నగర కాంగ్రెస్‌ అధ్యక్షులు ఎన్‌వి శ్రీనివాస్‌ మాట్లాడుతూ దళిత, మైనార్టీ, వెనుకబడిన వర్గాలకు కాంగ్రెస్‌ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. దళితులు, మైనార్టీలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దేశంలో హింస పెరగకుండా, శాంతి, అహింస మార్గంలో నడిచే విధంగా పాలకులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు సోడదాసి మార్టిన్‌ లూదర్‌, గుల్లా ఏడుకొండలు, ఐతాబత్తుల సుభాషిణి, కామన ప్రభాకర్‌, దాసి వెంకట్రావు, ఆకుల సూర్యభాగ్యలక్ష్మి, అబ్దుల్లా షరీఫ్‌, బాలేపల్లి మురళీధర్‌, తాళ్ళూరి విజయకుమార్‌, గోలి రవి, కాటం రవి, వాసంశెట్టి గంగాధర్‌, ఎస్‌ఎకె అర్షద్‌, బోడ వెంకట్‌, ముళ్ళా మాధవ్‌, చాపల చినరాజు, ఎస్‌ఎం అన్సర్‌, ఎండి షహిన్‌షా, సుభాన్‌ వల్లి, బబ్లూ, పిల్లా సుబ్బారెడ్డి, నలబాటి శ్యామ్‌, పట్నాల శ్రీనివాస్‌, దాకే రఘు, దాసరి ప్రసాద్‌, కె కుమారి, నరాల లక్ష్మి పార్వతి, పిసపాటి రవీంద్రశ్రీనివాస్‌, వెంకటేశ్వరరావు, ఉసురుమర్తి ఆనంద్‌, పెద్దఎత్తున కాంగ్రెస్‌ కార్యకర్తలు, ఐఎన్‌టియుసి, యువజన కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యుఐ కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here