20న బీసీ చైర్మన్లకు, కార్పొరేటర్లకు సత్కారం

0
53

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 10 : ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంక్షేమ సంఘం రాజమహేంద్రవరం శాఖ ఆధ్వర్యంలో ఈనెల 20న ఉదయం 10 గంటలకు కో ఆపరేటివ్‌ బ్యాంకుల బీసీ చైర్మన్‌లకు, నగర పాలక సంస్థ బీసీ కార్పొరేటర్లకు అభినందన సత్కారసభ నిర్వహిస్తున్నట్లు బిసి సంఘం నగర అధ్యక్షుడు మజ్జి అప్పారావు తెలిపారు. స్ధానిక ప్రెస్‌ క్లబ్‌లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 20న జాంపేటలోని ఉమా రామలింగేశ్వర స్వామి కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఆర్యాపురం బ్యాంక్‌ చైర్మన్‌ చల్లా శంకర్రావు, జాంపేట బ్యాంకు చైర్మన్‌ బొమ్మన రాజ్‌ కుమార్‌, ఇన్నీస్‌ పేట బ్యాంక్‌ చైర్మన్‌ కోళ్ళ అచ్యుతరామారావులతో పాటు 26 మంది బిసి కార్పొరేటర్లను సత్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం రాజకీయాలకు అతీతంగా జరుగుతుందని, ముఖ్య అతిధులుగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు, రాష్ట్ర జెఎసి చైర్మన్‌ మార్గాని నాగేశ్వరరావు, జాతీయ ప్రధాన కార్యదర్శి ఆల్మాన్‌రాజ్‌, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గొలగాని కిషోర్‌ యాదవ్‌, సెక్రటరీ ఆఫ్‌ జనరల్‌ అంగిరేకుల ఆదిశేషు, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు కుమ్మర క్రాంతికుమార్‌, రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు సురగాని లక్ష్మి, జిల్లా అధ్యక్షుడు పంపన రామక ష్ణ, గ్రేటర్‌ అధ్యక్షుడు నరవ గోపాలక ష్ణ పాల్గొంటారని తెలిపారు. వీరితో పాటు నగరానికి చెందిన శాసనమండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, బీసీ ప్రముఖులు పట్టపగలు వెంకట్రావు, రెడ్డి రాజు, పిల్లి సుబ్రహ్మణ్యం తదితర ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. సంఘ రాష్ట్ర కో ఆర్డినేటర్‌ మార్గాని రామక ష్ణ గౌడ్‌ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో బిసిలకు ప్రాధాన్యమిచ్చే పార్టీలకే తమ మద్దతు ఉంటుందని అన్నారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి నగరంలో బీసీలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కార్యక్రమం కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ విలేకరుల సమావేశంలో బీసీ సంఘం నాయకులు మీసాల గోవిందరావు, గోలి రవి, బిల్డర్‌ చిన్నా, కొమాండూరి కుమారి, కొల్లి సుభాషిణి, పితాని లక్ష్మి కుమారి, వినయకుమారి, సత్యశ్రీ, నరాల లక్ష్మీ పార్వతి, గన్నెమ్మ, అడపా సింధుప్రియ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here