ఫూలే పోరాటాల స్పూర్తే యువతకు ఆదర్శం

0
39

ఘనంగా నివాళులు అర్పించిన బిసి నాయకులు

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 11 : మహాత్మా జ్యోతీరావు ఫూలే గొప్ప సంఘసంస్కర్త అని బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర జెఏసి కన్వీనర్‌ మార్గాని నాగేశ్వరరావు అన్నారు. మహత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా బిసి జిల్లా యువజన సంఘం నాయకులు దాస్యం ప్రసాద్‌ ఆధ్వర్యంలో స్కూటర్‌ ర్యాలీ నిర్వహించారు. ఆదెమ్మదిబ్బ నుంచి దేవిచౌక్‌, గోకవరం బస్టాండ్‌, పుష్కర్‌ ఘాట్‌ మీదుగా మార్గాని నాగేశ్వరరావు ఇంటికి చేరి ఆయనతో సహ గోదావరి గట్టున ఉన్న ఫూలే విగ్రహం వరకు ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా మార్గాని నాగేశ్వరరావు, రాష్ట్ర కో ఆర్డినేటర్‌ మార్గాని రామక ష్ణ గౌడ్‌, దాస్యం ప్రసాద్‌, మజ్జి అప్పారావు, గోలి రవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్గాని నాగేశ్వరరావు మాట్లాడుతూ దళితులకు, స్త్రీలకు విద్య నిర్బంధంగా యిచ్చి తీరాలని వారి కోసం పోరాడిన ధీశాలి ఫూలే అని, అంతేకాక వారి ఉన్నతి కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తి అని పేర్కొన్నారు.దాస్యం ప్రసాద్‌ మాట్లాడుతూ భారతీయ సాంఫ్నిక వ్యవస్థను ప్రక్షాళన చేసి, ఆయన అందరికి స్పూర్తిగా నిలిచారని అన్నారు.ఆయన స్పూర్తితో బిసిల హక్కుల సాధనకు పునరంకితమవుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొల్లి సుభాషిణి, ఉల్లూరి రాజు, విత్తనాల శివ వెంకటేష్‌, యన్నంశెట్టి హనుమంతరావు, మైసర్ల సంతోష్‌, పోతురాజు, కందికొండ అనంత్‌, ధవళేశ్వరం రాజు, ముంతా సుమతి, తాళ్ళూరి బాబూ రాజేంద్రప్రసాద్‌,కొరుకొండ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here