ఇంటర్‌లో ఈ విద్యా సంవత్సరం నుంచి గ్రేడింగ్‌ విధానం

0
38

ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 62 శాతం ఉత్తీర్ణత : మంత్రి గంటా

విశాఖపట్టణం, ఏప్రిల్‌ 13 : ఇంటర్మీడియెట్‌ స్థాయిలో సైతం ఈ విద్యా సంవత్సరం నుంచి గ్రేడింగ్‌ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖపట్టణంలో ఈరోజు ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షా ఫలితాలను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ విద్యార్ధులపై ఒత్తిడిని తగ్గించి ప్రైవేట్‌ విద్యా సంస్థల మధ్య అనారోగ్యకరమైన పోటీని నిరోధించేందుకు ఇప్పటికే పదవ తరగతిలో ప్రవేశపెట్టిన గ్రేడింగ్‌ విధానాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్‌ విద్యలో కూడా ప్రవేశపెడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది ఇంటర్‌ ఫలితాల్లో విద్యార్ధులు 62 శాతం ఉత్తీర్ణతను సాధించారని, ఫలితాల్లో కృష్ణా, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాలు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్ధానాల్లో నిలిచాయని చెప్పారు. ఇంటర్‌ స్పాట్‌ వాల్యుయేషన్‌లో అక్రమాల నివారణకు బయో మెట్రిక్‌ విధానాన్ని ప్రవేశపెట్టడంతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రికార్డు సమయంలో పరీక్షలు పూర్తయిన 24 రోజుల్లో ఫలితాలను వెలువరించినట్లు ఆయన అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here