మంత్రి లోకేష్‌తో గుడా చైర్మన్‌ గన్ని భేటీ

0
40

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 13 : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పంచాయితీ, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ను గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ నిన్న అమరావతిలోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా, రాజమహేంద్రవరం పార్టీ విశేషాలతో పాటు తాను పార్టీ సమన్వయకర్తగా ఉన్న విజయనగరం పార్లమెంట్‌ నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలను సుదీర్ఘంగా చర్చించారు. ఎన్‌డీఏ కూటమి నుంచి తెదేపా బయటకొచ్చిన తర్వాత ప్రజల నుంచి వస్తున్న స్పందనను గన్ని ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా పలు ప్రజా సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్ళారు. గన్ని వెంట దళితరత్న కాశి నవీన్‌కుమార్‌, లక్ష్మణ్‌ తదితరులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here