దార్శనికుడు అంబేద్కర్‌

0
38

రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ దార్శనికుడని పలువురు నేతలు కొనియాడారు. అంబేద్కర్‌ 127వ జయంతి సందర్భంగా ఈరోజు నగరంలో పలు చోట్ల విగ్రహావిష్కరణ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. స్థానిక కోటిలింగాలపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్‌ విగ్రహాన్ని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మేయర్‌ పంతం రజనీ శేషసాయి, టీడీపీ యువనేత ఆదిరెడ్డి వాసు, ఎంపీ మాగంటి మురళీమోహన్‌ కోడలు మాగంటి రూప, కార్పొరేటర్లు కోసూరి చండీప్రియ, ద్వారా పార్వతి సుందరి, ఆర్యాపురం సత్యనారాయణ స్వామి దేవస్థానం మాజీ చైర్మన్‌ బూరాడ భవానీశంకర్‌, టీడీపీ నాయకులు కడితి జోగారావు, పొదిలాపు నాగేంద్ర, అట్టాడ శ్రీను, బొచ్చా శ్రీను, గొర్రెల సత్యరమణి, అరిగెల బాబూనాగేంద్ర ప్రసాద్‌, బుడ్డిగ రవి తదితరులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆదిరెడ్డి తదితరులు పూలతో ఘనంగా స్వాగతం పలికారు. అంబేద్కర్‌ ఆశయాలను నేరేవేర్చేందుకు సిఎం చంద్రబాబు అహర్నిశలు కృషిచేస్తున్నారన్నారు. చంద్రబాబుకు ప్రజలందరూ మద్ధతుగా నిలిచి రాష్ట్రాన్ని మరింత ప్రగతి పథంలో నడిపేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. అక్కడ నుంచి రత్నంపేటకు ర్యాలీగా వెళ్లి మున్సిపల్‌ పార్కులో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆవిష్కరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here