కామాంధులకు ఉరే సరి

0
51

హత్యాచారాలకు నిరసనగా తెలుగు మహిళ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 17 : మహిళలు, బాలికలపై హత్యాచారాలకు పాల్పడుతున్న వ్యక్తులను, వారికి మద్ధతు పలికే నాయకులను ఉరి తీయాలని రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. కో ఆప్షన్‌ సభ్యురాలు మజ్జి పద్మ ఆధ్వర్యంలో ఈరోజు కోటిపల్లి బస్టాండ్‌ నుంచి తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం నిరసన ర్యాలీ చేపట్టింది. పలు రాష్ట్రాల్లో బాలికలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను నిరశిస్తూ మహిళలు ప్లకార్డులు ప్రదర్శించారు. ” హత్యాచారాల రహిత భారతం..బిజెపి పాలన విముక్తితోనే సాధ్యం”, ”మోడీ పాలన…మహిళలకు ఏదీ రక్షణ, ఆసిఫా మరణానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి” అంటూ వారు నినాదాలు చేశారు. ఎన్‌టిఆర్‌ విగ్రహం వద్ద పవిత్రమైన భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌లను చదివి ప్రార్ధనలు చేశారు. కోటిపల్లి బస్టాండ్‌ నుంచి శ్యామలా సెంటర్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. మహిళా విభాగం నిరసన కార్యక్రమానికి ఎమ్మెల్యే గోరంట్లతో పాటు ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మేయర్‌ పంతం రజనీ శేషసాయి, కాపు కార్పొరేషన్‌ డైరక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడు, ఆర్యాపురం బ్యాంక్‌ చైర్మన్‌ చల్లా శంకరరావు,దళితరత్న కాశి నవీన్‌కుమార్‌, ఆదిరెడ్డి వాసు, కార్పొరేటర్లు బూర దుర్గాంజనేయరావు,కోరుమిల్లి విజయ్‌శేఖర్‌, మానుపాటి తాతారావు, ఆర్యాపురం బ్యాంక్‌ డైరక్టర్‌ సూరంపూడి శ్రీహరి, పల్లి సాయి, శీలం గోవింద్‌ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సమాజంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతి ఒక్కరు నిలదీయాలని, పిరికితనంతో వెనుకడుగు వేస్తే ఇలాంటి ఘటనలు పునరావృత్తమవుతాయన్నారు. ప్రతి మహిళ ధైర్యంతో ముందడుగు వేసి శక్తివంతంగా తయారు కావాలని, మహిళలపై, బాలికలపై అఘాయిత్యానికి పాల్పడిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ద్వారా పార్వతి సుందరి, గరగా పార్వతి, కోసూరి చండీప్రియ, పితాని లక్ష్మీకుమారి, కరగాని మాధవి, కురగంటి ఈశ్వరి, కో ఆప్షన్‌ సభ్యురాలు కప్పల వెలుగుకుమారి, కాకర్ల సుజన, ముంతాజ్‌ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here