ఖర్చుకు వెనుకాడకుండా ఘాట్లలో భద్రతా చర్యలు

0
57

పుష్కరాల రేవు వద్ద పనుల్ని పరిశీలించిన గోరంట్ల

రాజమహేంద్రవరం,ఏప్రిల్‌ 19: ప్రజల ప్రాణ రక్షణ దృష్ట్యా ఎంత ఖర్చయినా పుష్కరాల రేవు ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రభుత్వం పూర్తి చేస్తుందని రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. స్థానిక పుష్కరాల రేవు వద్ద జరుగుతున్న ప్రక్షాళన పనులను ఆయన ఈరోజు పరిశీలించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గోదావరి ఘాట్ల దుస్థితి గురించి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళానని, ప్రజల ప్రాణ రక్షణ దష్ట్యా ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణమే స్పందించి ఘాట్లు ప్రక్షాళన చెయ్యాలని మున్సిపల్‌, ఇరిగేషన్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారని అన్నారు. గత పుష్కరాల సమయంలో వరదలు రావడం వలన పనులు నిలిచిపోయాయన్నారు. అలాగే మూడవ రైల్వే బ్రిడ్జి నిర్మాణ సమయంలో రైల్వే అధికారులు కాంక్రీట్‌ పోల్స్‌, ఇనుము రద్దు అలాగే వదిలి వెయ్యడం వలన ఈ ప్రాంతంలో ఊబులు ఏర్పడ్డాయని అన్నారు. హేవ్‌ లాక్‌ బ్రిడ్జి మొదటి స్తంభం నుండే అధికంగా లోటు ఉందని పిల్లలు, పెద్దలు తెలియక ఊబిలో పడి మరణించడం జరుగుతోందని అన్నారు. ముందుగా మునిసిపల్‌ అధికారులు పుష్కరాల రేవు తీరాన్ని శుభ్రపరుస్తున్నారని, మట్టి పని, సీల్డ్‌ తొలగిస్తున్నారని తదుపరి ఇరిగేషన్‌ అధికారులు పనులు మొదలుపెడతారని అన్నారు. ఆ తరువాత కోటిలింగాల ఘాట్‌, మార్కండేయ ఘాట్‌ వద్ద ప్రక్షాళనల పనులు చేపడతామని అన్నారు. భక్తులకు అత్యంత పవిత్రమైన ప్రదేశం, మరణాలు కూడా ఇక్కడ అధికంగా నమోదు అవుతున్నందున ముందుగా పుష్కర ఘాట్లోనే పనులు పూర్తి చేస్తామని అన్నారు. రేవులో 20 అడుగుల మేర కాంక్రీట్‌ వేసి తదుపరి బ్యారికేడింగ్‌ వేస్తే భక్తులు అది దాటి ముందుకు వెళ్లే పరిస్థితి ఉండదని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here