నినదించిన నిరసన గళం

0
72

సీఎం ‘ధర్మ పోరాట దీక్ష’కు తెలుగు తమ్ముళ్ళ సంఘీభావం

అంబేద్కర్‌ విగ్రహం వద్ద 12 గంటల నిరసన దీక్ష

కేంద్రం దిగి వచ్చే వరకు అన్యాయంపై పోరాటం కొనసాగిస్తామని ప్రతిన

తెలుగుదేశం నిరాహారదీక్షకు వివిధ సంఘాల మద్ధతు వెల్లువ

రాజమహేంద్రవరం,ఏప్రిల్‌ 20 : జన్మనిచ్చిన జన్మభూమి కోసం పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండి రాష్ట్ర ప్రయోజనాల కోసం ధర్మపోరాట దీక్ష చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సంఘీభావంగా రాజమహేంద్రవరం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గోకవరం బస్టాండ్‌ సమీపంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద చేపట్టిన నిరాహార దీక్షకు అపూర్వ స్పందన లభించింది. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాలను అమలు చేయడంలో కేంద్రం చూపుతున్న నిర్లక్ష్యాన్ని నిరశిస్తూ తెదేపా అధ్యక్షుని హోదాలో గాక సీఎంగా చంద్రబాబు చేపట్టిన ‘ధర్మపోరాట దీక్ష’కు అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణ మద్ధతు తెలియజేశారనడానికి నగరంలో జరిగిన పోరాట దీక్షకు పెద్ద ఎత్తున విద్యార్ధులు, ఉద్యోగులు, వ్యాపారులు, న్యాయవాదులు, వర్తక ప్రతినిధులు, వైద్యులు, వైద్య విద్యార్ధులు, వివిధ సంఘాల నాయకులు అశేషంగా తరలిరావడం ఇందుకు నిదర్శనం. సీఎం చంద్రబాబు ధర్మపోరాట దీక్షకు సంఘీభావంగా నగర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఉదయం ఏడు గంటల నుంచి దీక్ష ప్రారంభించారు. ముందుగా వేదికపై ఏర్పాటు చేసిన ఎన్‌టిఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్లమెంట్‌ సభ్యులు మాగంటి మురళీమోహన్‌, గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ, యువ నాయకులు ఆదిరెడ్డి వాసు తదితరులు అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం దీక్షా శిబిరంలో గన్ని కృష్ణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మేయర్‌ పంతం రజనీ శేషసాయి, కాపు కార్పొరేషన్‌ డైరక్టర్‌ యర్రా వేణు, ఆర్యాపురం అర్బన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ చల్లా శంకరరావు, ప్లోర్‌ లీడర్‌ వర్రే శ్రీనివాసరావు, నగర ప్రధాన కార్యదర్శి రెడ్డి మణేశ్వరరావు, దళితరత్న కాశి నవీన్‌కుమార్‌, ఆదిరెడ్డి వాసు, టిఎన్‌టియుసి జిల్లా అధ్యక్షులు నక్కా చిట్టిబాబు, మాజీ కార్పొరేటర్‌ కురగంటి సతీష్‌, బుడ్డిగ రాధ, షేక్‌ సుభాన్‌, కార్పొరేటర్లు నిరాహార దీక్షలో పాల్గొన్నారు. వీరికి ఎంపి మాగంటి మురళీమోహన్‌, రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ సత్యనారాయణరాజు తదితరులు సంఘీభావం తెలియజేసి కొద్దిసేపు దీక్షా శిబిరంలో ఆసీనులయ్యారు. దీక్షా శిబిరాన్ని వివిధ డివిజన్ల తెదేపా కమిటీ సభ్యులు, జన్మభూమి కమిటీ సభ్యులు, లిటిల్‌ ప్యారడైజ్‌ స్కూలు, బీవిఎం స్కూల్‌, శ్రీ గౌతమీ స్మార్ట్‌ స్కూలు, తిరుమల ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌, గైట్‌ కళాశాల విద్యార్ధులు, మాతృశ్రీ జూనియర్‌ కళాశాల, జీఎస్‌ఎల్‌ మెడికల్‌ కళాశాల, రాజమహేంద్రి డిగ్రీ కళాశాల విద్యార్ధులు, పేపర్‌మిల్లు వర్కర్క్స్‌ యూనియన్‌ ప్రతినిధులు,రాజమండ్రి హోటల్స్‌ అసోషియేషన్‌, కంబాలచెరువు, గోకవరం బస్టాండ్‌ స్వర్ణాంధ్ర ఆటో వర్కర్స్‌ యూనియన్‌, టీఎన్‌టియుసి భవన నిర్మాణ సంఘం, కొత్తపేట ఫ్రెండ్స్‌ సర్కిల్‌, గోదావరి జీఎస్‌కె వర్కర్క్స్‌ యూనియన్‌, వాటర్‌ వర్క్స్‌ వర్కర్స్‌ యూనియన్‌, ఎంఆర్‌పిఎస్‌ నాయకులు, దేవీచౌక్‌ వర్తక సంఘం, వెలమ సంక్షేమ సంఘం, రాజమండ్రి రజక సంఘం, విజిటబుల్‌ మార్కెట్‌ వర్తక సంఘం, సబ్‌ వే మార్కెట్‌ వర్కర్స్‌ యూనియన్‌, రాజమండ్రి, రూరల్‌ టైలర్స్‌ అసోషియేషన్‌, తెదేపా లీగల్‌ సెల్‌, రాష్ట్ర రెల్లి కులాల సంక్షేమ సంఘం, ఆర్టీసి కాంప్లెక్స్‌ ఆటో వర్కర్క్స్‌ యూనియన్‌, నాయీ బ్రాహ్మణ సంక్షేమ సంఘం, రాజమండ్రి బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం, రాజమండ్రి ఫర్నీచర్‌ అసోషియేషన్‌, ఆంధ్రప్రదేశ్‌ అంగన్‌వాడీ హెల్పర్స్‌ అండ్‌ వర్కర్క్స్‌ యూనియన్‌, మెప్మా ప్రతినిధులు సందర్శించి దీక్ష చేస్తున్న నాయకులకు తమ సంఘీభావాన్ని తెలియజేశారు. రాజమండ్రి అర్చక సమాఖ్య ద్వారా పురోహితులు, రాజమండ్రి పాస్టర్స్‌ అసోషియేషన్‌ ద్వారా పాస్టర్లు, షేక్‌ సుభాన్‌, చాన్‌భాషా, ఎస్‌కె గఫూర్‌ ద్వారా ముస్లిమ్‌ పెద్దలు వచ్చి సర్వమత ప్రార్థనలు చేసి చంద్రబాబు ధర్మపోరాటం ఫలించాలని, రాష్ట్రం అభివృద్ధి కోసం పనిచేస్తున్న సీఎంకు శక్తిని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని ప్రార్థించారు. ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ దీక్షా శిబిరం వద్ద బుర్ర కథను ఏర్పాటు చేశారు. గత నాలుగేళ్ళ కాలంలో, అంతకు ముందు రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను, చంద్రబాబు పోరాటాలను అందరికీ తెలియజేసేలా దీక్షా ప్రాంగణంలో ఒక ఎల్‌ఇడి టీవిని ఏర్పాటు చేశారు. వేసవి తాపం ఎక్కువగా ఉన్నందున దీక్షా శిబిరానికి తరలివస్తున్న మద్ధతుదారుల కోసం రాజమహేంద్రవరం మున్సిపల్‌ కారట్రాక్ట్‌ర్స్‌ అసోషియేషన్‌ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేసి మజ్జిగ పంపిణీ చేశారు. స్ధానిక 23 వ డివిజన్‌కు చెందిన కాకర్ల విశ్వనాథ్‌ దీక్షా శిబిరాన్ని సందర్శించి కేంద్రం తీరుపై అర్థనగ్న ప్రదర్శనతో రాజమహేంద్రవరం నుంచి అమరావతికి చేపట్టిన బైక్‌ ర్యాలీని గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ జెండా వూపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపి మురళీమోహన్‌, ఎమ్మెల్యే గోరంట్ల, గుడా చైర్మన్‌ గన్ని, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి, మేయర్‌ రజనీ శేషసాయి మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో చంద్రబాబు సమర్ధత, కార్యదక్షతపై ప్రజలు ఎంతో నమ్మకంతో ఆయనను సీఎం చేశారని, అదే నమ్మకాన్ని మళ్ళీ చూపిస్తూ తాము చేపట్టిన ధర్మపోరాట దీక్షకు సంఘీభావం తెలపడం ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుందన్నారు. పుట్టిన రోజు వేడుకలను నిర్వహించకుండా దీక్షల ద్వారా కేంద్రంపై ధర్మాగ్రహం ప్రకటించాలన్న చంద్రబాబు పిలుపును రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు అందుకుని స్పందించారని తెలిపారు. చంద్రబాబుకు ఐదు కోట్ల ఆంధ్రులే అండదండ అని,వారి కోసమే ఆయన నిరంతరం కష్టపడుతున్నారని తెలిపారు. ధర్మ పోరాట దీక్షకు వచ్చిన స్పందనతో కేంద్రంలో గుబులు పుట్టిందని, హోదా సాధించే వరకు విశ్రమించబోమన్నారు. దీక్షా శిబిరంలో యేలూరి వెంకటేశ్వరరావు, మజ్జి రాంబాబు, కార్పొరేటర్లు కడలి రామకృష్ణ, కోరుమిల్లి విజయ్‌శేఖర్‌, కోసూరి చండీప్రియ, పాలిక శ్రీనివాస్‌, తంగేటి వరలక్ష్మీ, కిలపర్తి శ్రీనివాస్‌, మానుపాటి తాతారావు, గొందేశి మాధవిలత, కొమ్మ శ్రీనివాస్‌, మాటూరి రంగారావు, యిన్నమూరి రాంబాబు, బెజవాడ రాజ్‌కుమార్‌, కురగంటి ఈశ్వరి, బూర దుర్గాంజనేయరావు, ద్వారా పార్వతి సుందరి, గాదిరెడ్డి పెద్ద బాబు, రెడ్డి పార్వతి, కరగాని మాధవి, తంగెళ్ళ బాబి, సింహ నాగమణి, మళ్ళ నాగలక్ష్మీ, గరగా పార్వతి, కో ఆప్షన్‌ సభ్యులు చాన్‌ భాషా, మజ్జి పద్మ, కప్పల వెలుగుకుమారి, పార్టీ నాయకులు రొబ్బి విజయ్‌శేఖర్‌, శెట్టి జగదీష్‌, పితాని కుటుంబరావు, దాలిపర్తి వేమన, మళ్ళ వెంకట్రాజు, సూరంపూడి శ్రీహరి, ఉప్పులూరి జానకిరామయ్య, మానే దొరబాబు,జాలా మదన్‌,కవులూరి వెంకట్రావ్‌, మజ్జి అప్పారావు, కర్రి కాశీ విశ్వనాథం ఈతలపాటి కృష్ణ, ముమ్మిడి లక్ష్మీ, రాయపాటి శ్యామల, గొర్రెల సత్యరమణి, మాలే విజయలక్ష్మీ, కర్రి రాంబాబు, మరుకుర్తి రవియాదవ్‌, నల్లం ఆనందకుమార్‌, తంగేటి సాయి, అరిగెల బాబూ నాగేంద్రప్రసాద్‌, తురకల నిర్మల, కంచిపాటి గోవింద్‌, విశ్వనాథ రాజు, తలారి భాస్కర్‌, పిన్నింటి రవిశంకర్‌, పెనుగొండ రామకృష్ణ, మహబూబ్‌ జానీ, ఆనెం చిన్న, పైలా రాంబాబు, సీరెడ్డి బాబి, జాగు వెంకటరమణ, ధమరసింగ్‌ బ్రహ్మాజీ, కంటిపూడి శ్రీనివాస్‌, పిడిమి ప్రకాష్‌, మజ్జి సోమేశ్వరరావు,వానపల్లి శ్రీనివాసరావు, పిన్నింటి రవిశంకర్‌, నందిగాని మురళీకృష్ణ, మేరపురెడ్డి రామకృష్ణ, బొచ్చా రమణ, టేకుమూడి నాగేశ్వరరావు,ఆశపు సత్యనారాయణ, పుట్టా సాయిబాబు, బెజవాడ వెంకటస్వామి దీక్షలో పాల్గొన్నారు. దీక్షా శిబిరాన్ని రెడ్డి రాజు, కార్పొరేటర్లు మర్రి దుర్గా శ్రీనివాస్‌, పాలవలస వీరభద్రం, జీఎస్‌ఎల్‌ మెడికల్‌ కళాశాల చైర్మన్‌ గన్ని భాస్కరరావు, చాంబర్‌ ప్రతినిధులు నందెపు శ్రీనివాస్‌, దొండపాటి సత్యంబాబు, బూర్లగడ్డ సుబ్బారాయుడు, గ్రంధి పిచ్చియ్య, మద్దాల రవిశంకర్‌, హోటల్స్‌ అసోషియేషన్‌ ప్రతినిధులు కోసూరి సుబ్బరాజు, వేగేశ్న సూర్యనారాయణరాజు, దోనేపూడి సుమన్‌, పామర్ల సత్యనారాయణ, కోటిపల్లి దుర్గా ప్రసాద్‌, కుమార్‌, రాయుడు బాబ్జీ, నగర ప్రముఖులు కోళ్ళ అచ్యుతరామారావు (బాబు) చలుమూరు శ్రీనివాసరావు, డా.చలుమూరు తులసీ మోహనరావు, ఖాదర్‌ ఖాన్‌, పార్టీ నాయకులు నిమ్మలపూడి గోవింద్‌, పొన్నమాటి బాబ్జీ, కరగాని వేణు, పరిమి వాసు, బట్లంకి ప్రకాష్‌, మద్ది నారాయణరావు, బత్తుల శ్రీరాములు, మద్దు సతీష్‌, చింతపల్లి సత్యనారాయణ, వెంట్రప్రగడ ఉమా మహేశ్వరి, యెక్కల వీర నాగేశ్వరరావు, పల్లి సాయి, తమ్మన గోపాలకృష్ణ, కేదారిశెట్టి గోవింద్‌, సింహాద్రి సతీష్‌, కాట్రు లక్ష్మణస్వామి, కాట్రు రమణ కుమారి, చించినాడ తాతాజీ, జక్కంపూడి శ్రీరంగనాయకులు, బొచ్చా శ్రీను, కడితి జోగారావు, నల్లం శ్రీను, మేడిశెట్టి కృష్ణారావు, తీడా నర్సింహమూర్తి, ఎస్‌ఏ కరీమ్‌,కోరాడ సత్యశ్రీదేవి, ఆర్‌.మధువరప్రసాద్‌, పులి శ్రీనివాసరెడ్డి, వంక శ్రీనివాసచౌదరి, నున్న కృష్ణ, పడగల ప్రసాద్‌, రేవాడ సత్యనారాయణ, కురగంటి త్రినాథ్‌, పొలుగుమాటి కుమార్‌, కరుటూరి అభిషేక్‌, చిన్నారి ఉమా మహేశ్వరరావు, మిస్కా జోగినాయుడు, గరగ మురళీకృష్ణ, చిట్టూరి ప్రవీణ్‌చౌదరి, సప్పా ఉమ, బిసి సంఘం నాయకులు గంగుల సూర్యారావు, దాస్యం ప్రసాద్‌, ఎండి మున్నా, క్షత్రియ సాయిరాంసింగ్‌ తదితరులు పాల్గొన్నారు.పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు రాయుడు శ్రీనివాసరాజు, రాచపల్లి ప్రసాద్‌, యార్లగడ్డ అశోక్‌కుమార్‌, కె.శారద,కనక లింగేశ్వరరావు కూడా సంఘీభావం తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here