నక్కా శ్రీనగేష్‌కు పితృ వియోగం

0
51

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 23 : నగర కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షులు నక్కా శ్రీనగేష్‌ తండ్రి, విశ్రాంత పోస్ట్‌ మాస్టర్‌ నక్కా శ్రీరాములు ఈరోజు తెల్లవారుజామున వై-జంక్షన్‌లోని సుబ్బారావుపేటలో ఉన్న ఆయన స్వగృహంలో కన్నుమూశారు. ఆయన వయస్సు 82 సంవత్సరాలు. కొద్దికాలంగా ఆయన అస్వస్థతతో ఉన్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. నక్కా శ్రీనగేష్‌ పెద్ద కుమారుడు. ఈ సాయంత్రం సిమెంటరీ పేట క్రైస్తవుల సమాధుల తోటలో భూస్థాపన కార్యక్రమం జరుగుతుంది. శ్రీరాములు మరణవార్త తెలియగానే మాజీ ఎం.పి. ఉండవల్లి అరుణ్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ అల్లు బాబి, దళితరత్న కాశీ నవీన్‌కుమార్‌, నగర కాంగ్రెస్‌ అధ్యక్షులు ఎన్‌.వి.శ్రీనివాస్‌, ముళ్ళ మాధవ్‌, కోలమూరు ప్రభాకర్‌, అబుల్లా షరీఫ్‌, కొల్లి వెలసి హారిక, గుమ్మడి సమర్పణరావు, బొంతా శ్రీహరి, బొమ్మనమైన శ్రీనివాస్‌, అశోక్‌కుమార్‌ జైన్‌, కుంపట్ల అమర్‌నాధ్‌, బెజవాడ రంగా, వెలిగట్ల పాండురంగారావు, మార్తి నాగేశ్వరరావు, మార్తి లక్ష్మి, వైరాల అప్పారావు, మేడపాటి అనిల్‌రెడ్డి, టేకుమూడి నాగేశ్వరరావు, శౌరి నాధన్‌, నల్లా రాజేష్‌, కాటం రవి, గోలి రవి, పిల్లా సుబ్బారెడ్డి, రవీంద్ర శ్రీనివాస్‌, పసుపులేటి కృష్ణ, దుర్గ, లింగంపల్లి వెంకటేశ్వరరావు, బోయిలపల్లి కరుణాకర్‌, యు.రాజారావు, సారిపల్లి శ్రీనివాస్‌, పట్నాల విజయకుమార్‌ తదితరులు ఆయన భౌతికకాయానికి నివాళులర్పించి నగేష్‌కు, కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here