అర్హులకు పక్కా గృహాలు నిర్మించాలి

0
38

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 23 : నగరంలో అర్హులైన పేదలకు పక్కా గృహాలు నిర్మించాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఈరోజు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి నల్లా రామారావు మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న గృహ దరఖాస్తులను పరిశీలించి అర్హులకు గృహాలు మంజూరయ్యేలా చర్యలు చేపట్టాలని, పేదలకు రూ.3వేలు పింఛను అందించాలని, రేషన్‌ షాపులలో నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని, పేదలకు ఉచితంగా విద్య, వైద్యం అందించాలని, జన్మభూమి కమిటీలను రద్దు చేయాలని, ప్రభుత్వం ఆదేశించిన కోనేరు రంగారావు సిఫార్సులను అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తోకల ప్రసాద్‌, యడ్ల లక్ష్మి, సేపేని రమణమ్మ, నల్లా భ్రమరాంబ, వంగమూడి కొండలరావు, శెట్టి నాగమణి, కాసాని శంకరరావు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here