చంద్రబాబే రాష్ట్రానికి పెద్ద దిక్కు

0
43

భావితరాల భవిష్యత్‌కు ఆయననే బలపరుద్దాం

జైలు పక్షులకు రాష్ట్రాన్ని అప్పగిస్తే అథోగతే

14 వ డివిజన్‌లో సైకిల్‌ యాత్రలో తెదేపా నేతలు

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 26 : విభజన కారణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు దిక్కు చంద్రబాబునాయుడేనని, ఆయన వల్లే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు.స్ధానిక 14 వ డివిజన్‌లో పార్టీ ఇన్‌ఛార్జి కూరాకుల తులసి, దుర్గారావు ఆధ్వర్యంలో తెదేపా సైకిల్‌ యాత్ర చేపట్టారు. ముందుగా ఎన్‌టిఆర్‌ విగ్రహానికి గన్ని, ఆదిరెడ్డిలతో పాటు మేయర్‌ పంతం రజనీ శేషసాయి. దళితరత్న కాశి నవీన్‌కుమార్‌, తెదేపా యువ నాయకులు ఆదిరెడ్డి వాసు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ జెండాను ఎమ్మెల్సీ ఆదిరెడ్డి ఎగురవేశారు. ఈ సందర్భంగా సైకిల్‌ యాత్రను మేయర్‌ రజనీశేషసాయి జెండా ఊపి ప్రారంభించారు. డివిజన్‌లో పలు ప్రాంతాల్లో సైకిల్‌ యాత్ర చేపట్టి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను, కేంద్ర వైఖరిని వివరించారు. కార్యక్రమంలో గన్ని మాట్లాడుతూ నమ్మిన మిత్ర పక్షం ఏ విధంగా వెన్నుపోటు పొడిచి నమ్మక ద్రోహం చేసిందో, వెంకటేశ్వర స్వామి సాక్షిగా నరేంద్ర మోడీ ఇచ్చిన వాగ్ధానాలను గంగా నదిలో ఎలా కలిపారో వివరించేందుకే సైకిల్‌ యాత్రను చేపట్టామన్నారు. కేంద్రం వైఖరిని నాలుగేళ్ళ పాటు ఓపిక పట్టిన సీఎం చంద్రబాబు తప్పనిసరి పరిస్థితుల్లో కేంద్రంపై తిరుగుబాబు చేశారని, కేంద్రం సహకరించకపోయినా ప్రజల సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపంచే సత్తా ఆయనకుందన్నారు. చంద్రబాబును బలపరిస్తే అభివృద్ధికి మద్ధతు ఇచ్చినట్లు, భావితరాల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని సమర్ధత,కార్యదక్షత కలిగిన ఆ నాయకునికి అండగా నిలవాలని కోరారు. ఇందిరాగాంధీ వంటి నాయకురాలిని మట్టికరిపించిన ఘనత తెలుగుదేశం పార్టీకి ఉందని, రానున్న రోజుల్లో అదే తిరిగి పునరావృతం కానుందని అన్నారు. జైలుకెళ్ళిన నాయకులు పాదయాత్రలతో ప్రజల్లోకి వస్తున్నారని, అటువంటి నాయకునికి రాష్ట్రాన్ని అప్పగిస్తే నష్టపోతామన్నారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంపై కేంద్రం చేస్తున్న కుట్ర పూరిత రాజకీయాలను ప్రజలకు వివరిస్తామని, వారు చేసిన మోసాలను, వివక్షతను చాటి చెబుతామన్నారు. గవర్నర్‌ సైతం రాజకీయాలకు పాల్పడి కొన్ని పార్టీలను ఏకం చేసేందుకు ప్రయత్నించడం దారుణమన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు అర్ధరహిత విమర్శలు చేస్తున్నారని, మిత్రపక్షంగా రాష్ట్రానికి ఇచ్చిన ప్రాధాన్యత ఏమిటో చెప్పాలన్నారు. 2019 ఎన్నికల్లో బిజెపికి ఏపీలో పుట్టగతులు ఉండవన్నారు. మేయర్‌ రజనీ శేషసాయి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తున్న సీఎం చంద్రబాబు నాయకత్వాన్ని అంతా బలపర్చాలని, ఏపీపై వివక్ష చూపుతున్న కేంద్రానికి బుద్ధి చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కడలి రామకృష్ణ, మర్రి దుర్గా శ్రీనివాస్‌, కోరుమిల్లి విజయ్‌శేఖర్‌, మాజీ కార్పొరేటర్‌ కురగంటి సతీష్‌, కో ఆప్ష న్‌ సభ్యురాలు కప్పల వెలుగుకుమారి, పార్టీ నాయకులు పితాని కుటుంబరావు, మళ్ళ వెంకట్రాజు, పెనుగొండ రామకృష్ణ, కర్రి రాంబాబు,మేరపురెడ్డి రామకృష్ణ,ఈతలపాటి కృష్ణ, జాగు వెంకటరమణ, పుట్టా సాయిబాబు, ఆవాల ఈశ్వర్‌, లచ్చిరెడ్డి వాసు, కర్రి కాశీ విశ్వనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here