చంద్రబాబు భయపడే రకం కాదు..ఆయన నీడను కూడా తాకలేరు

0
58

హొదా వద్దని ఎప్పుడూ చెప్పలేదు..కుదరదంటేనే ప్యాకేజీకి ఓకే అన్నారు

రాష్ట్రం కోసమే బిజెపితో జతకట్టారు..టిడిపితోనే బిసిలకు న్యాయం

రాష్ట్ర అధ్యక్ష పదవి కోసమే సోము విమర్శలు : ఎమ్మెల్సీ ఆదిరెడ్డి ధ్వజం

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 26 : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీడను కూడా ఎవరూ తాకలేరని, ఒకవేళ అటువంటి ప్రయత్నం చేస్తే రాష్ట్రంలో ఊహించని పరిణామాలు జరుగుతాయని శాసనమండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు హెచ్చరించారు. స్ధానిక ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆదిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు భయపడే రకం కాదని, ఏదైనా సాధించడానికి పోరాడే రకమన్నారు. రాష్ట్రంలో కుట్ర రాజకీయాలు జరుగుతున్నాయన్నారు. కేంద్రం ప్రభుత్వంతో పాటు, రాష్ట్రంలోని ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ద్వారపూడి సభలో రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం ప్రజలు తనకు కవచంలా ఉండాలన్నారే తప్ప, తనకు రక్షణ ఇవ్వాలని చంద్రబాబు అనలేదన్నారు. విభజనకు కారణం కాంగ్రెస్‌, బిజేపిలేనని, కాంగ్రెస్‌కు రాష్ట్రంలో అడ్రస్సు లేకుండా చేశారని, ప్రత్యేక ¬దాతో పాటు, విభజన హామీలను నెరవేర్చని బిజెపికి కూడా అదే గతి పడుతుందన్నారు. బిజెపితో జతకట్టాలని చంద్రబాబు ఎప్పుడు అనుకోలేదని, రాష్ట్ర విభజన నేపధ్యంలో జాతీయ స్ధాయిలో ఒక పార్టీ అండగా ఉంటే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతోనే బిజెపితో జతకట్టారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక ¬దా వద్దని చంద్రబాబు ఎప్పుడు చెప్పలేదని, ¬దాతో పాటు విభజన హామీలలో 18 అంశాలను అమలు చేయాలనే ఎప్పుడూ కోరారన్నారు. ¬దా ఇవ్వడానికి సాధ్యపడదని చెప్పడంతో పాటు 2017 తర్వాత హొదా ఉండదని చెప్పడం కారణంగానే ప్యాకేజికి అంగీకరించారన్నారు. కేంద్రం నుంచి ఎటువంటి తోడ్పాటు రాకున్నా రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి పధంలో తీసుకువెళ్లడానికి కృషి చేస్తున్నారన్నారు. చంద్రబాబుపై నమ్మకంతోనే రాష్ట్రానికి కియో, హీరో వంటి సంస్ధలు ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఎన్‌డిఎతో బయటకు రావడంతో వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన రూ.350 కోట్లను పిఎం కార్యాలయం అనుమతి లేదని వెనక్కి తీసుకున్నారని ఈవిధంగా ఎప్పుడైనా జరిగిందా అని ప్రశ్నించారు. జాతీయ విద్యాసంస్ధల అభివృద్ధికి రాష్ట్రం భూములు కేటాయించి, ప్రహారీ గోడల నిర్మాణానికి నిధులు వెచ్చించినప్పటికీ, ఆయా సంస్ధలకు కేంద్రం నుంచి అవసరమైన నిధులు రాలేదన్నారు. ప్రహారీ గోడలు నిర్మాణం పూర్తికానందునే నిధులు ఇవ్వలేదని ఎంఎల్‌సి మాధవ్‌ చెప్పడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. కలిసి ఉన్నప్పుడు పట్టిసీమ గురించి మాట్లాడని బిజెపి నేతలు ఇప్పుడు విమర్శించడం తగదన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల నిర్మాణం ద్వారా రెండు నదులను అనుసంధానం చేయగలిగామని, కృష్ణాతో పాటు రాయలసీమ ప్రాంతానికి నీరు ఇచ్చామన్నారు. పట్టిసీమకు రూ.1600 కోట్లు ఖర్చుచేస్తే, రెండేళ్ళలో రూ.3వేల కోట్లకు పైగా ఆదాయాన్ని సాధించామన్నారు. మాట్లాడితే చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేస్తున్న బిజేపి నేతలు కేంద్ర ప్రభుత్వంపై రాఫెల్‌ విమానాల కొనుగోలుకు సంబంధించి రూ.25వేల కోట్ల అవినీతి అరోపణలు వచ్చాయని దానికి ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసమే ఎమ్మెల్సీ సోము వీర్రాజు అదేపనిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపైనా, రాష్ట్ర ప్రభుత్వంపైనా విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు సమర్ధ పాలన, సంస్కరణల వల్లే రాష్ట్రంలో 24 గంటలు విద్యుత్‌ ఇవ్వగలుగుతున్నారు తప్ప, అందులో కేంద్రం చేసిందేమీ లేదన్నారు. 50లక్షల మందికి పింఛన్లు నెలకు రూ.1000,1500 చొప్పున ఇస్తున్న ఘనత చంద్రబాబుదేనన్నారు. నగేరా నిధులను కన్వెర్జెన్సీ విధానంతో సమర్ధవంతంగా వినియోగించుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. గత ప్రభుత్వాలు సమర్ధవంతంగా పనిచేయకపోవడంతో నగేరా నిధులు వెనక్కి వెళ్ళిపోయాయన్నారు. బీసిలకు అన్యాయం చేస్తున్నారంటూ చంద్రబాబుపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. టిడిపి అంటేనే బిసిల పార్టీ అని, టిడిపి ప్రభుత్వంలోనే వారికి న్యాయం జరుగుతుందన్నారు. ఎన్‌టిఆర్‌ నుండి చంద్రబాబు వరకు బిసిలను రాజకీయంగా ప్రోత్సహించారని గుర్తుచేశారు. నగరంలో బిసి హాస్టల్స్‌ నిర్మాణానికి రూ.5.68 కోట్లు కేటాయించారని త్వరలోనే నిర్మాణాలు ప్రారంభం అవుతాయన్నారు. ఆదరణ పధకం ఈనెల 30న జిల్లా నుండే ప్రారంభం అయ్యే అవకాశం ఉందన్నారు. బీసిల కోసం మాట్లాడే అర్హత టిడిపికి తప్పితే ఇతర పార్టీలకు లేదన్నారు. వైసిపికి ముఖ్యమంత్రి పదవి దక్కించుకోవడమే అజెండా తప్ప మరొకటి కాదన్నారు. కేంద్రప్రభుత్వం మట్టి, నీరు ఇచ్చింది తప్ప, ఇంక ఏమీ చేయలేదన్నారు. రాష్ట్రంలో నామినేటెడ్‌ పదవులు ఇవ్వలేదంటున్న బిజెపి, కేంద్ర నామినేటెట్‌ పోస్టులు టిడిపి వారికి ఎన్ని ఇచ్చారో చెప్పాలన్నారు. టిడిపి బయటకు వచ్చేస్తుందని తెలిస్తే నిధులు ఇచ్చేవారము కాదని ఓ నేత అన్నారంటే వారి కుట్ర కోణం అర్ధం చేసుకోవచ్చన్నారు. పోలవరం నిర్మాణానికి రాష్ట్రం రూ. 900 కోట్లు కేటాయించడాన్ని కేంద్ర ప్రభుత్వంలోని నాయకులు విమర్శించడాన్ని తప్పుపట్టారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అని, ఆ ప్రాజెక్టుకు ఎంత ఖర్చుచేస్తే అంతా కేంద్రం తిరిగి ఇవ్వాల్సిందేనన్నారు. బిజెపితో జత కట్టడం వల్ల గత ఎన్నికల్లో గెలవాల్సిన కొన్ని సీట్లను గెలవలేకపోయామన్నారు. గతంలో సోము వీర్రాజు ఎంపి, ఎంఎల్‌ఎ పదవులకు పోటీ చేస్తే కనీసం డిపాజిట్‌లు దక్కలేదని, వచ్చే ఎన్నికల్లో ఆయన పార్టీ పరిస్థితి కూడా అలాగే ఉంటుందన్నారు. విలేకరుల సమవేశంలో కార్పొరేటర్‌లు యిన్నమూరి రాంబాబు, ద్వారా పార్వతి సుందరి, కోరుమెల్లి విజయశేఖర్‌, కోసూరి చంఢీప్రియ, , టిడిపి నాయకులు రెడ్డి సతీష్‌, మేడిశెట్టి కృష్ణారావు, పితాని కుటుంబరావు, తురకల నిర్మల, తంగేటి సాయిబాబా, మేరపురెడ్డి రామకృష్ణలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here