బాటసారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు అవసరం

0
34

కంబాలచెరువు వద్ద జి.కె. స్పందన చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 27 : ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నందున బాటసారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అవసరమని గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ అన్నారు. జి.కె. స్పందన చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో కంబాలచెరువు వద్ద గల స్వతంత్ర పెట్రోల్‌ బంక్‌లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని తెలుగుదేశం పార్టీ ఫ్లోర్‌ లీడర్‌ వర్రే శ్రీనివాసరావు ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా గన్ని కృష్ణ మాట్లాడుతూ జి.కె. స్పందన చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నగరంలో ముఖ్యమైన ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, స్వతంత్ర పెట్రోల్‌ బంక్‌లో ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నందున మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు మజ్జిగ పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కో-ఆపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కాశి నవీన్‌కుమార్‌, మాజీ కార్పొరేటర్‌ కురగంటి సతీష్‌, కార్పొరేటర్లు యిన్నమూరి రాంబాబు, తంగెళ్ళ బాబి, బెజవాడ రాజ్‌కుమార్‌, పాలవలస వీరభద్రం, పార్టీ నాయకులు మజ్జి రాంబాబు, నిమ్మలపూడి గోవింద్‌, మళ్ళ వెంకట్రాజు, ఉప్పులూరి జానకిరామయ్య, మునుకుర్తి తాతబ్బాయి, వానపల్లి సాయిబాబా, శీలం గోవింద్‌, మాకాని లక్ష్మణరావు, కాకర్ల ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here