దగా చేసిన పార్టీలకు పుట్టగతులుండవు

0
81

కేంద్రమంత్రి వ్యాఖ్యలతో వైకాపా చీకటి ఒప్పందం బట్టబయల్ణు

1, 2 డివిజన్‌ల్లో ఉత్సాహంగా తెదేపా సైకిల్‌ యాత్ర

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 27 : ఆంధ్రులను దగా చేసిన పార్టీలకు పుట్టగతులు ఉండవని తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. స్థానిక 1, 2 డివిజన్‌లలో కార్పొరేటర్లు కడలి రామకృష్ణ, పితాని లక్ష్మీకుమారి ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ సైకిల్‌ యాత్ర నిర్వహించారు. ఎం.పి. మాగంటి మురళీమోహన్‌, రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ డైరెక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడు, టిడిపి యువ నాయకులు ఆదిరెడ్డి వాసు తదితరులు పాల్గొనగా నగర మేయర్‌ పంతం రజనీ శేషసాయి జెండా ఊపి సైకిల్‌ యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా 1, 2 డివిజన్‌లలో సైకిల్‌ యాత్ర నిర్వహించి ప్రజలను కలిసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని వివరించడంతోపాటు రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని వివరించారు. ఈ సందర్భంగా మురళీమోహన్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి చలనం కలగాలన్న ఉద్దేశ్యంతోనే తెదేపా సైకిల్‌ యాత్ర చేపట్టిందని తెలిపారు. గోరంట్ల మాట్లాడుతూ తెలుగుజాతికి చేసిన దగాను నిరసిస్తూ ఈ కార్యక్రమం తలపెట్టామని పేర్కొన్నారు. నీతి నియమాలకు మోడీ సర్కార్‌ నిదర్శనమని పదే పదే చెప్పే బిజెపి నాయకులు యుద్ధ విమానాల కొనుగోలులో జరిగిన అవినీతిపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. రాష్ట్రానికి చేసిన అన్యాయంపై సీఎం చంద్రబాబు కేంద్రంతో పోరాడుతుంటే రాష్ట్రంలో కొంతమంది కుహనా నాయకులు కేంద్రంతో జత కట్టడం సిగ్గు చేటన్నారు. గన్ని కృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన నమ్మక ద్రోహంపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అవిశ్రాంతంగా పోరాడుతున్నారని, ఆయన పోరాటానికి ప్రజల మద్దతును కోరేందుకు ఈ యాత్రలు చేపట్టామన్నారు. ఎన్‌డిఏ నుంచి తెదెపా బయటకు వచ్చాక వారితో జత కట్టేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉవ్విళ్ళూరుతోందని నిన్న కేంద్రమంత్రి ఆ పార్టీని ఎన్‌డిఏ కూటమిలో చేరాలని ఆహ్వానించడం అందుకు నిదర్శనమని, ఇప్పటికైనా వారి చీకటి ఒప్పందానికి ముసుగు తొలగిందన్నారు. మేయర్‌ పంతం రజనీ శేషసాయి మాట్లాడుతూ చంద్రబాబు రాష్ట్రాభివృద్ధికి చేసిన కృషిని ప్రజలు మరిచిపోకూడదన్నారు. ఈ కార్యక్రమంలో దళితరత్న కాశీ నవీన్‌కుమార్‌, కార్పొరేటర్లు కోసూరి చండీప్రియ, కోరుమిల్లి విజయశేఖర్‌, పార్టీ నాయకులు ముప్పన రుద్ర, కురగంటి సతీష్‌, ఉప్పులూరి జానకిరామయ్య, పితాని కుటుంబరావు, విశ్వనాథరాజు, పుట్టా సాయిబాబు, కె.వి.డి.భాస్కర్‌, కుడుపూడి సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here