సీతంపేటలో బీసీ యువజన సంఘం కార్యాలయం ప్రారంభం

0
47

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 28 : స్థానిక సీతంపేటలో ఏర్పాటు చేసిన బీసీ యువజన సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయాన్ని ఆ సంఘం రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ మార్గాని రామకృష్ణ గౌడ్‌ ఈరోజు ప్రారంభించారు. జిల్లా యువజన సంఘం అధ్యక్షులు దాస్యం ప్రసాద్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని ప్రారంభించిన గౌడ్‌ మాట్లాడుతూ సంఘాన్ని బలోపేతం చేస్తూ యువతను ఒకే తాటిపైకి తీసుకు రావాలని సూచించారు. జిల్లాలో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతూ వాటి పరిష్కారం దిశగా కృషి చేయాలని, 19 నియోజకవర్గాల్లో పర్యటించి కమిటీలను వేయాలని సూచించారు. దాస్యం ప్రసాద్‌ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి పూర్తిస్థాయి కమిటీలను నియమించి జిల్లా యువజన సదస్సును భారీ ఎత్తున ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విత్తనాల శివ వెంకటేష్‌, ఉల్లూరు రాజు, మైసర్ల సంతోష్‌, క్షత్రియ సాయిరామ్‌సింగ్‌, యన్నంశెట్టి నాని, సాయి, డి.రామ్మూర్తి, కె.హేమంత్‌, వారాది పోతురాజు, యు.శ్రీను, కె.లక్ష్మణరావు, కె.శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here