లఘు చిత్రాలను ఆదరించాలి : సుమన్‌

0
84

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 30 : సమాజానికి అవసరమయ్యే సందేశాన్ని అందిస్తున్న లఘు చిత్రాలను ప్రేక్షకులు ఆదరించాలని సినీ నటుడు సుమన్‌ అన్నారు. రక్షా క్రియేషన్స్‌ బ్యానర్‌పై హరీష్‌ దర్శకత్వంలో నూతన నటీనటులతో నిర్మించిన ‘రామసక్కనోడమ్మ చందమామ’ ప్రచార చిత్రం పోస్టర్‌ను సుమన్‌ ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుమన్‌ మాట్లాడుతూ ఒక కొత్త కథనంతో దర్శకుడు హరీష్‌ లఘు చిత్రాన్ని అద్భుతంగా తెరపైకి ఎక్కించారని, గతంలో మామ్‌ ఓన్లీ చిత్రం ఘన విజయం సాధించిందని, అలాగే ఈ చిత్రం కూడా విజయవంతం కావాలన్నారు. దర్శకుడు హరీష్‌ మాట్లాడుతూ వచ్చే నెల 5న ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబ్‌ చానల్‌ ద్వారా చిత్రాన్ని విడుదల చేస్తున్నామని, హీరోగా తేజ, హీరోయిన్‌గా భవ్య అద్భుతంగా నటించారని, రాజ్‌కిరణ్‌ చక్కటి సంగీతాన్ని అందించారన్నారు.పట్టణంలో పెరిగిన యువకునికి, గ్రామీణ వాతావరణంలో జరిగిన అనుకోని సంఘటనల ప్రేమకథే ఈ చిత్రం సారాంశమన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here