కాపు విద్యార్ధులు పథకాలను సద్వినియోగపర్చుకోవాలి : యర్రా

0
73
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 21 : కాపు విద్యార్ధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను సద్వినియోగపర్చుకోవాలని కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడు అన్నారు. స్థానిక వి.టి. కళాశాలలో టిఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు వలీ భాషా అధ్యక్షతన కాపు కార్పొరేషన్‌ రుణాలు – ఉపకార వేతనాలు అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న యర్రా వేణు మాట్లాడుతూ కాపు విద్యార్ధులు విదేశాలకు వెళ్ళి విద్యాభ్యాసం చేసేందుకు విదేశీ విద్యా దీవెన పథకం అమలు చేస్తున్నామని, రూ.10లక్షల సబ్సిడీతో రూ.25 లక్షల వరకు రుణం అందిస్తామన్నారు. పోటీ పరీక్షలకు కూడా కార్పొరేషన్‌ ద్వారా శిక్షణ అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శ్రీరామమూర్తి, టిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర నాయకులు నక్కా దేవీ వరప్రసాద్‌, నగర మాజీ అధ్యక్షులు యల్లంకి జయరామ్‌, వంశీ కృష్ణ, అజయ్‌ శంకర్‌, మచ్చా గణేష్‌, రవి, వాసుదేవ, తదితరులు పాల్గొన్నారు.