అంబేద్కర్‌ వాదంతో ఏకీభవించే అందరితో కల్సి ప్రయాణిస్తాం

0
39

మాలమహానాడు అండ్‌ బిసి వెల్ఫేర్‌ సంస్థ అధ్యక్షులు శీతల్‌

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 17 : అంబేద్కర్‌ వాదంతో ఏకీభవించే అందరితో కల్సి ప్రయాణిస్తామని, ముందుండి ఉద్యమాలు చేయడమే కాకుండా, ఎస్సీ బీసీ, బహుజనుల అభ్యున్నతికి ఎవరి వెనుకైనా ఉండి, క షి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని మాలమహానాడు అండ్‌ బిసి వెల్ఫేర్‌ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు టి .శీతల్‌ చెప్పారు. సంస్థ నూతన నియామకాల సందర్బంగా ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు ఉదయం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితులకు కొన్ని కేసుల్లో అన్యాయం జరుగుతున్నా కొంతమంది దళారులు ఈ కేసులను సెటిల్‌ చేస్తూ, కేసులను నీరుగారుస్తున్నారని ఆయన పేర్కొంటూ అలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. దళిత, బిసి, బహుజనులకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అందేలా చూడడం, రాజ్యాధికారం వైపు నడిపించడం తమ లక్ష్యమన్నారు. అంబేద్కర్‌ని ఆరాధిస్తున్నట్టు ముద్రగడ పద్మనాభం చెప్పడంతో ఆయన ఇంటికి వెళ్లి కలిశానని, ఇలా కల్సి వచ్చే ఎవరితోనైనా పనిచేయడానికి ముందుంటామని ఆయన చెప్పారు. సంస్థ రాజమండ్రి రూరల్‌ అధ్యక్షునిగా బండి నాగేంద్ర, సీతానగరం మండల అధ్యక్షునిగా దొడ్డే శ్రీను,బొబ్బిల్లంక అధ్యక్షునిగా అంబటి వీర్రాజు,ఉపాధ్యక్షునిగా దంతే చిట్టిబాబు, గోకవరం మండల ఉపాధ్యక్షునిగా బత్తుల కామరాజు,కోరుకొండ మండలం మహిళా విభాగం అధ్యక్షులుగా నూతలపాటి రాజేశ్వరి, కోరుకొండ మండల అధ్యక్షునిగా సన్నపు శివ, కోరుకొండ నరసాపురం అధ్యక్షునిగా మురాల లక్ష్మణరావు,గంగవరం మండల నెల్లిపూడి గ్రామ అధ్యక్షునిగా నాంబత్తుల రాజు లను నియమిస్తూ పత్రాలను అందజేశారు. పదవుల ద్వారా దళారులుగా ఉందామనుకుంటే కుదరదని, పనికి ఆహార పథకంగా పదవులను భావించరాదని ఆయన సూచించారు. ఒకవేళ పదవిని దుర్వినియోగం చేస్తే, తక్షణం తొలగిస్తామని స్పష్టం చేసారు. సమావేశంలో మార్గాని చంటిబాబు, సిరింగి రత్నకుమార్,రాఘవేంద్ర యాదవ్, గౌతు లచ్చన్న మనుమడు రామ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here