పాత సోమాలమ్మ వారిని దర్శించుకున్న గన్ని దంపతులు

0
39

రాజమహేంద్రవరం, మార్చి 1 : స్ధానిక శ్యామలానగర్‌లో వేంచేసి ఉన్న శ్రీశ్రీశ్రీ పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలను పురస్కరించుకుని ఈరోజు అమ్మవారిని గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ, రాజేశ్వరి దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త, కార్పొరేటర్‌ గొర్రెల సురేష్‌, కమిటీ సభ్యులు ఆలయ మర్యాదలతో గన్ని దంపతులకు స్వాగతం పలికారు. కాగా ఈ రోజు అమ్మవారు మహంకాళి అవతారంలో భక్తులకు దర్శనమివ్వగా ఈ అవతారం తమకెంతో నయనాందకరంగా ఉందని, ఈ ఏడాది అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించడం విశేషంగా ఉందని గన్ని అన్నారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న గొర్రెల సురేష్‌, ఇతర సభ్యులను ఆయన అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here