చంద్రబాబుకు అండగా ఉందాం

0
37
25, 29 డివిజన్లలో తెదేపా సైకిల్‌ యాత్ర
రాజమహేంద్రవరం, మే 9 : కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన అన్యాయంపై ధర్మ పోరాటం చేస్తున్న సీఎం చంద్రబాబుకు ఆంధ్రులు అండగా నిలవాలని  ఎం.పి. మాగంటి మురళీమోహన్‌, గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కోరారు. స్థానిక 25, 29 డివిజన్లలో కార్పొరేటర్‌ కురగంటి ఈశ్వరి సతీష్‌, కో-ఆప్షన్‌ సభ్యురాలు మజ్జి పద్మ ఆధ్వర్యంలో సైకిల్‌ యాత్ర చేపట్టారు. డివిజన్‌లలో సైకిల్‌ యాత్ర నిర్వహించి కేంద్రం చేస్తున్న కుట్రలను వివరించారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ పంతం రజనీ శేషసాయి, శాప్‌ డైరెక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడు, ఎస్సీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కాశి నవీన్‌, పార్టీ నగర ప్రధాన కార్యదర్శి రెడ్డి మణి, పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి వాసు, కార్పొరేటర్లు కడలి రామకృష్ణ, కొమ్మ శ్రీనివాస్‌, బెజవాడ రాజ్‌కుమార్‌,  బూర దుర్గాంజనేయరావు, సింహ నాగమణి, పార్టీ నాయకులు కొండేటి సుధాకర్‌, సీరెడ్డి బాబి, అట్టాడ రవి, కొయ్యాన కుమారి, మేరపురెడ్డి రామకృష్ణ, కవులూరి వెంకట్రావు, జాలా మదన్‌, పుట్టా సాయిబాబు, పెరుమాళ్ళ ప్రకాష్‌, విశ్వనాథరాజు, రంభ యరకేశ్వరరావు, తవ్వా రాజా, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here