శ్రమశక్తికి నిలువెత్తు  నిదర్శనం

0
242

అనుబంధం ఆత్మీయత
అంతా ఓ బూటకం…
ఆత్మతృప్తికై మనుషులు
ఆడుకునే నాటకం……..అన్నారో సినీకవి

‘మానవసంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలన్నారో ‘ సిధ్దాంతకర్త…

ఇటువంటి కృత్రిమ నాగరిక సమాజంలో కుటుంబ బంధాలకూ..ఆత్మీయనురాగాలనూ …తోటివారి పట్ల మెలగవలసిన తీరునూ…నైతిక విలువలతో కూడిన వ్యక్తిత్వం మనుషులకెంత అవసరమో…
శ్రమశక్తి పట్ల నమ్మకంతో…చేసే పని పట్ల నిబద్ధత నిజాయితీ అంకితభావంతో కృషిచేస్తే అసాధ్యాలు సుసాధ్యాలెలా అవుతాయో నిజజీవితంలో ఆచరించిన మా నాన్నగారు కీశే గన్ని సత్యనారాయణమూర్తి గారి జయంతి ఈరోజు ..
ఓ సామాన్య రైతు కుటుంబంలో జన్మించి..కష్టనష్టాలకోర్చి టీచర్ ట్రైనింగ్ తీసుకుని బడిపంతులుగా జీవనయానం ప్రారంభించి వామపక్ష భావజాలానికాకర్షితులై తద్వారా జమీందారుల ఆగ్రహాన్ని చవిచూసి వారానికి రెండు బదిలీలు చొప్పున మంచినీరు కూడా దొరకని ప్రదేశాలకుకూడా వెల్లవలిసిన పరిస్థితి ఆయనలో కసినీ పట్టుదలనూ పెంచాయి…జీవితంలో ఇంతకన్నా సాధించి తన్నుతాను నిరూపించుకోవాలనే తపన రగిలింది…దానితో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి పుల్లల అడితీ తో రాజమండ్రి లో కొత్త జీవితాన్ని ప్రారంభించి ఫారెస్ట్ కాంట్రాక్టర్ గా ఎదిగి మారుమూల అడవిప్రాంతాలలో నెలల తరబడి వుంటూ ఎన్నో శ్రమదమాదులకోర్చి జీవితంలో ఓస్థాయికి వచ్చారు…అప్పట్లో మా నాన్నగారు ఇంటికి వచ్చారూ అంటే మలేరియా జ్వరంతో వణుకుతున్నపుడు మాత్రమే అనిఅర్ధం…అడవిలో దున్నలతోనూ ఎడ్లతోనూ దూలాలు లాగించే సమయంలో అవసరమైతే ఓ కాడి ఆయన భుజాలకెత్తుకోవడానికి కూడా సంశయించే వారు కాదంటే అతిశయోక్తి కాదు…
ఫారెస్ట్ వ్యాపారతీరుతెన్నలు దరిమిలా మారిన తరువాత స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ గా రాజవొమ్మంగి మారేడిమిల్లి రంప చోడవరం ప్రాంతాలలోనే కాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ టౌన్ షిప్ లోనూ ఎన్నో ప్రతిష్టాకరమైన కట్టడాలు నిర్మించారు…రాష్ట్రం లోనే మొట్టమొదటి ప్రైవేట్ రంగపు వేబ్రిడ్జ్ నెలకొల్పారు …పెట్రోలియం వ్యాపారం ప్రాంరంభించారు…సాహసనిర్ణయాలు తీసుకుని నిక్షేపం వంటి అరవై ఎకరాల మామిడితోటను నరికి కొత్తగా వచ్చిన గారెంటీలేని పామాయిల్ తోట వేసి నీళ్లు లేని చోటకూడా రిస్కు చేసి విజయవంతమై తరువాత కాలంలో ఎందరికో మార్గదర్శకుడయ్యారు…తరువాత కాలంలో కూడా హాస్పిటల్ నిర్మాణం లో గాని మాతల్లి గారి పేరున మెడికల్ కాలేజ్ నెలకొల్పడం లో గానీ ఆయన చూపిన భవిష్యదృష్టి ఆయా సంస్థల విజయాలకు గానీ ఎందరికో జీవనోపాధి కలిపించడంలోగానీ ఆదర్శనీయం…
ఆర్యాపురం అర్బన్ బాంక్ అధ్యక్షుడిగా ఆయన నెలకొల్పిన ఉన్నతప్రమాణాలను ఇప్పటికీ ఉద్యోగులుగానీ పాలకవర్గాలు గానీ తలచుకుంటున్నారంటే ఆయన నీతి నిబద్ధతలే కారణం…
ఆయన ఎప్పుడు మాకైనా ఆయన సన్నిహితులకైనా ఒకటే చెప్పేవారు…నువ్వు చేసే పని చిన్నదైనా పెద్దదైనా అంకితభావంతో నీతి నిజాయితీలతో చేస్తే తప్పకుండా విజయం సాధిస్తావ్…అని !! ‘ పల్కు దారుణాఖండల శస్త్ర తుల్యము…నిండు మనంబు నవ్యనవనీతసమానము ‘ అన్న వాక్యాలు సరిగ్గా సరిపోల్చదగ్గవి…ఓ సందర్భంలో మాకుటుంబ మితృలు నవీన్ గారి మాటల్లోనే శ్రమశక్తి కి నిలువెత్తు ఉదాహరణ మానాన్న గారు….ఆయన జయంతి సందర్భంగా మా అక్షర నీరాజనాలు …ఆయన జీవనగమనం కొంతమందికైనా స్ఫూర్తిదాయకమౌతుందన్న ఆకాంక్షతో ఈ చిన్న అక్షర ప్రయత్నం…ధన్యవాదాలు …!! – జికె