అర్బన్‌ ఎస్పీ, మేయర్‌కు ముస్లింల సత్కారం

0
39
రాజమహేంద్రవరం, మే 9 : లాలాచెరువులో మౌజన్‌ హత్య కేసులో చాకచక్యంగా వ్యవహరించి 48 గంటల్లో నిందితుడిని అరెస్ట్‌ చేసిన ఎస్పీ రాజకుమారిని, మశీదు పునర్నిర్మాణానికి నగరపాలక సంస్థ ద్వారా నిధులు మంజూరు చేయించిన మేయర్‌ పంతం రజనీశేషసాయిలను ముస్లిం పెద్దలు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు. రాజమహేంద్రవరం చరిత్రలో మంచి అధికారిణిగా రాజకుమారి నిలిచిపోతారని, ముస్లింల పట్ల ఆమె సంస్కారవంతమైన ప్రవర్తన అభినందనీయమని పలువురు ముస్లింలు కొనియాడారు. నగర మేయర్‌ స్పందించిన తీరు కూడా అమోఘమన్నారు.  సిసిసి యాంకర్‌ చోటు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో కరీంఖాన్‌, హబీబుల్లాఖాన్‌, జమీర్‌ఖాన్‌, చాన్‌భాషా, సుభాన్‌, ఖాదర్‌ఖాన్‌, అబ్దుల్‌ కరీమ్‌, సయ్యద్‌ మదీనా, షెహెన్‌షా, సుభాన్‌ వల్లీ, అన్సర్‌, రియాజ్‌, ఎస్‌.కె.కరీం, ఖాదర్‌ఖాన్‌, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here