జగన్‌ యాత్రకు భారీ ఏర్పాట్లు

0
19

రాజమహేంద్రవరం, జూన్‌ 11 : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర రేపు మధ్యాహ్నం 3 గంటలకు రోడ్‌ కమ్‌ రైలు బ్రిడ్జి మీదుగా కోటిపల్లి బస్టాండ్‌కు చేరుకోనుంది. జగన్‌ను ఘనంగా స్వాగతించేందుకు రోడ్‌ కమ్‌ రైలు బ్రిడ్జి, కోటిపల్లి బస్టాండ్‌ వద్ద ఆ పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here