తృతీయ ప్రత్యామ్నాయంగా ‘ఎపి యూనైటెడ్‌ ఫ్రంట్‌’

0
19

త్వరలో 13 జిల్లాల్లో కమిటీల ఏర్పాటు – మేడా శ్రీనివాస్‌ చొరవకు పలువురి అభినందనలు

రాజమహేంద్రవరం, జూన్‌ 11 : రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా రిజిష్టర్డ్‌ అయిన రాజకీయపార్టీలు అన్ని కలిసి ఆంధ్రప్రదేశ్‌ యునైటెడ్‌ ఫ్రంట్‌గా ఒక వేదికపైకి వచ్చాయి. రాజమహేంద్రవరం కేంద్రంగా పనిచేస్తున్న రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌ పార్టీ వ్యవస్ధాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్‌ చొరవతో ఈరోజు రాష్ట్రంలో రిజిష్టర్డ్‌ రాజకీయపార్టీలు అన్ని కలిసి సమావేశమయ్యాయి. స్ధానిక వై.జంక్షన్‌లోని ఆనంరోటరీహాల్‌లో మేడా శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం జరిగింది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో అధికారంలో వున్న వారు, ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావడంలో ప్రధాన ప్రతిపక్షం విఫలమై మరోసారి ప్రజలను మోసగించేందుకు స్వార్దరాజకీయ ఎత్తుగడలు వేస్తున్నాయని సమావేశం ఆరోపించింది. ప్రధాన రాజకీయపార్టీలు, ధనిక పార్టీలకు ప్రత్యామ్నాయంగా నూతన రాజకీయశక్తి ఏర్పాటు అవసరమని సమావేశంలో పాల్గొన్నవారంతా అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీస్ధానాలు, 25 ఎంపి స్ధానాల్లో ఫ్రంట్‌ తరపున అభ్యర్ధులను పోటీలో దింపాలని, ఎవరి పార్టీ తరపున వారు రంగంలో వున్నా ఉమ్మడి అజెండాతో ఎన్నికల ప్రచారం సాగించాలనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటించాలని, వెనుకబడిన వర్గాల నుండి ఎంపిక జరగాలని ప్రతిపాదన చేసినా దానిని వాయిదా వేయాలని నిర్ణయించారు. ముందుగా ఫ్రంట్‌ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు అందరూ ఆమోదం తెలపడంతో ఆంధ్రప్రదేశ్‌ యునైటెడ్‌ ఫ్రంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్రీయ ప్రజాకాంగ్రెస్‌ పార్టీ వ్యవస్ధాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్‌ ప్రకటించారు. ఈ ఫ్రంట్‌కు చైర్మన్‌గా నెల్లూరు జిల్లాకు చెందిన ఆంధ్రరాష్ట్ర ప్రజాసమితి అధ్యక్షుడు పెళ్లపూడి సురేందర్‌రెడ్డి, కన్వీనర్‌గా విశాఖపట్నంకు చెందిన సామాన్య ప్రజాపార్టీ అధ్యక్షుడు కె.ఆదిబాబును ప్రకటించారు. ఈ సమావేశంలో రాష్ట్రీయ ప్రజాకాంగ్రెస్‌ పార్టీ నుండి మేడా శ్రీనివాస్‌, ఆ పార్టీ నాయకులు, గోదావరి ముస్లిమ్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నుండి దబీర్‌ అబ్ధుల్‌ రజాక్‌, ప్రకాశం జిల్లాకు చెందిన జనం పార్టీ నుండి తెనాలి రవిబాబు, పేదరికం నిర్మూలన పార్టీ నుండి డాక్టర్‌ కె.సుబ్బారావు, నెల్లూరు జిల్లాకు చెందిన తెలుగు బహుజనపార్టీ నుండి కె.వి.నరసింహం, అంబేద్కర్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా నుండి బూరిగ ఏసుదాసు, నెల్లూరు జిల్లాకు చెందిన ఆంధ్రరాష్ట్ర ప్రజాసమితి నుండి పెళ్లపూడి సురేందర్‌రెడ్డి, విశాఖపట్నంకు చెందిన సామాన్య ప్రజాపార్టీ నుండి కె.ఆదిబాబుతో పాటుగా ఆపార్టీ నాయకులు, ఉత్తరాంధ్ర జెఎసి నుండి జె.టి.రామారావు, గుంటూరు జిల్లాకు చెందిన సోషల్‌ జస్టిస్‌ పార్టీ నుండి వై.కె.కోటేశ్వరరావు, ఆమ్‌ఆద్మీ పార్టీ నుండి సేవాకుమార్‌(గుంటూరు), ప్రత్యేక¬దా, విభజన హామీల అమలు ఆత్మగౌరవ పోరాట కమిటీ కన్వీనర్‌ అవధానుల హరి, స్వచ్చందసేవకుడు కడలి రాజేంద్రప్రసాద్‌లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here