జగన్‌ నిర్ణయం పట్ల పట్ల బీసీ నేతల హర్షం

0
23

రాజమహేంద్రవరం, జూన్‌ 11 : కేశన శంకరరావు నాయకత్వంలో 13 జిల్లాల్లో బీసీ సంక్షేమ సంఘాలు రాజకీయ పార్టీలకు ధీటుగా బలోపేతం అవుతున్నాయని రాష్ట్ర బీసీ సంఘంకో-ఆర్డినేటర్‌ మార్గాని రామకృష్ణ గౌడ్‌ అన్నారు. బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి రాజకీయ పార్టీలకు కూడా బీసీ అభ్యర్థులకు ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు అధికంగా ఇవ్వాలని మొదటి నుండి డిమాండ్‌ చేస్తున్నామన్నారు. మొట్టమొదటి సారిగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి కొవ్వూరులో జరిగిన సభలో రాజమండ్రి ఎంపీ సీటు బీసీ అభ్యర్థికి ఇస్తానని ప్రకటించడంపై బీసీ సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఇదే విధంగా ప్రతీ రాజకీయ పార్టీ కూడా బీసీ అభ్యర్థులు అధికమందికి టికెట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. సమావేశంలో రాజమండ్రి గ్రేటర్‌ అధ్యక్షులు నరవ గోపాలకృష్ణ, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు దాస్యం ప్రసాద్‌, రాజమండ్రి సిటీ అధ్యక్షుడు మజ్జి అప్పారావు, రూరల్‌ అధ్యక్షుడు బిల్డర్‌ చిన్నా, నగర ప్రధాన కార్యదర్శి మీసాల గోవిందరావు, రాజమండ్రిగ్రేటర్‌ సెక్రటరీ ధర్మవరపు శ్రీనివాసరావు, (గెడ్డం శ్రీను), బీసీ నాయకులు కడలి వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి సప్పా ఆదినారాయణ, ఇతర బీసీ నాయకులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here