అన్నార్తులకు మెగా యూత్‌ ఫోర్స్‌ చేయూత

0
23

రాజమహేంద్రవరం, జూన్‌ 11 : పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరానికి గొల్లపల్లి బేబీ అనే మహిళ మస్కట్‌ లో ఇళ్ల పనులకోసం వెళ్లి, అక్కడే గుండెనొప్పితో మరణించింది. వీసా లేకపోవడంతో భౌతిక కాయం తీసుకురావడం ఇబ్బందిగా మారింది. దీంతో మెగా యూత్‌ ఫోర్స్‌ కి చెందిన చందక రామదాసు బాధ్యత తీసుకుని,భౌతిక కాయాన్ని ఇంటికి రప్పించే ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా ఒక లక్షా 10వేలరూపాయలు సేకరించి,దండుబోగుల రామారావు చేతుల మీదుగా వారి కుటుంబానికి ప్రెస్‌క్లబ్‌ లో అందజేశారు. జనసేన ఆజాద్‌ యూత్‌ వింగ్‌ జిల్లా సమన్యయ కర్త ఏడిద బాబి,వానపల్లి ఆంజనేయులు,నాళం వరప్రసాద్‌ ,కడియాల శ్యాం కుమార్‌, రాజ్‌ కుమార్‌, జాన్‌, ఇజ్జన శివ,రాజేష్‌,తదితరులతో కల్సి విలేకరుల సమావేశం నిర్వహించారు. గత 18ఏళ్లుగా చిరంజీవి,పవన్‌ కళ్యాణ్‌ స్పూర్తితో ప్రతీఏటా రక్తదాన శిబిరాలు నిర్వహించడంతో పాటు అన్నార్తులను ఆదుకునే సేవా కార్యక్రమాలను చందక రామదాసు చేస్తున్నారని వివరిస్తూ పలువురు ప్రశంసించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here