ప్రభుత్వ పథకాల్ని అర్హులకు చేరువ చేస్తా

0
23

ఎస్సీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన కాశి నవీన్‌

రాజమహేంద్రవరం, జూన్‌ 13 : రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభ్యున్నతికి ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను అర్హులైన వారికి అందజేయడమే లక్ష్యంగా పనిచేస్తానని దళితరత్న కాశి నవీన్‌కుమార్‌ అన్నారు. అమరావతిలోని ఎస్సీ కార్పొరేషన్‌ కార్యాలయంలో డైరెక్టర్‌గా ఆయన ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. కార్పొరేషన్‌ చైర్మన్‌ జూపూడి ప్రభాకరరావు సారధ్యంలో కాశీ నవీన్‌తోపాటు మరో నలుగురు బాధ్యతలు స్వీకరించి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా తాము పనిచేస్తామని, ఏ ప్రభుత్వం చేయని విధంగా సీఎం చంద్రబాబునాయుడు దళితుల కోసం వివిధ సంక్షేమ పథకాలను అమలు చేసి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందించారని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here