ఆప్యాయంగా పలకరిస్తూ.. సమస్యలు తెలుసుకుంటూ..

0
23

ధవళేశ్వరంలో ఉత్సాహంగా సాగిన ప్రజా సంకల్ప యాత్ర

రాజమహేంద్రవరం, జూన్‌ 13 : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి నిర్వహిస్తున్న ప్రజా సంకల్ప యాత్ర ఈరోజు రూరల్‌ నియోజకవర్గంలోని ధవళేశ్వరంలో ఉత్సాహంగా సాగింది. 188వ రోజు పాదయాత్రలో వై.ఎస్‌.జగన్‌ చిన్నారులను, విద్యార్ధులను, కార్మికులను, రైతులను, ఉద్యోగులను, మహిళలను, వృద్ధులను ఆప్యాయంగా పలుకరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వివిధ వర్గాలవారు జగన్‌ను కలిసి వినతులు సమర్పించారు. జగన్‌తో ఫొటో దిగాలని వచ్చిన వారిని ఆయన స్వాగతించి సెల్ఫీలు దిగారు. జగన్‌ పాదయాత్ర సందర్భంగా ధవళేశ్వరం మెయిన్‌రోడ్‌లో స్వాగత ద్వారాలు, ప్లెక్సీలు, పార్టీ జెండాలను భారీగా ఏర్పాటు చేశారు. ఈరోజు రైల్వేస్టేషన్‌ నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఐఎల్‌టిడి, లక్ష్మినరసింహనగర్‌ మీదుగా ధవళేశ్వరం చేరుకుంది. అక్కడ భోజన విరామం నిమిత్తం జగన్‌ యాత్రకు బ్రేక్‌ ఇచ్చారు. విరామం అనంతరం ధవళేశ్వరం నుంచి బ్యారేజీ మీదుగా బొబ్బర్లంక, పేరవరం వరకు పాదయాత్ర కొనసాగుతుంది. ఈ యాత్రలో రూరల్‌ నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌ ఆకుల వీర్రాజు, జక్కంపూడి విజయలక్ష్మి, రౌతు సూర్యప్రకాశరావు, కందుల దుర్గేష్‌, గిరిజాల బాబు, కొయ్యే మోషేన్‌రాజు, మేడపాటి షర్మిలారెడ్డి, నక్కా రాజబాబు, రావిపాటి రామచంద్రరావు, తదితరులు జగన్‌ వెంట ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here