ఓర్వ లేని పనులు.. దృష్టి మరల్చడానికి తంటాలు

0
25

తెదేపా పసుపు శుద్ధికి విరుగుడుగా జగన్‌ కటౌట్‌కు దిష్టితీసిన వైకాపా

రాజమహేంద్రవరం, జూన్‌ 14 : నగరంలో జరిగిన వై.ఎస్‌.జగన్‌ ప్రజా సంకల్ప బహిరంగ సభకు వచ్చిన అశేషజనవాహినిని, ప్రజాభిమానాన్ని చూసి తెలుగుదేశం నాయకులు ఓర్వలేకపోతున్నారని వైకాపా సిటీ కో-ఆర్డినేటర్‌, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు విమర్శించారు. జగన్‌ పాదయాత్రకు గోదావరి ఉప్పొంగినట్లుగా జనం తరలివచ్చారన్నారు. కోటిపల్లి బస్టాండ్‌వద్ద జగన్‌ కటౌట్‌కు ఈరోజు వైకాపా ఆధ్వర్యంలో నాయకులు గుమ్మడికాయతో దిష్టితీసి, గోదావరి జలాలతో శుద్దిచేసి, హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా రౌతు మాట్లాడుతూ కనివీని ఎరుగనిరీతిలో జనం ఆదరిస్తున్న జగన్‌కు టిడిపి నాయకులు దిష్టి తగులుతుందన్నారు. జగన్‌ ముఖ్యమంత్రి అవ్వాలని రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. ఎన్టీఆర్‌ విగ్రహాన్ని శుద్దిచేసిన టిడిపి నాయకులు తొలుత వారి మనసులను శుద్దిచేసుకోవాలని హితవు పలికారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడటం తథ్యమని రౌతు జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో వైకాపా ఫ్లోర్‌ లీడర్‌ మేడపాటి షర్మిలారెడ్డి, డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌ గుత్తుల మురళీధరరావు, కార్పొరేటర్‌ మజ్జి నూకరత్నం, నాయకులు పోలు కిరణ్‌మోహన్‌రెడ్డి, కానుబోయిన సాగర్‌, సుంకర చిన్ని, వాకచర్ల కృష్ణ, కుక్క తాతబ్బాయి, నీలం గణపతి, కాటం రజనీకాంత్‌, ఉప్పాడ కోటరెడ్డి, మారిశెట్టి వెంకటేశ్వరరావు, అందనాపల్లి సత్యనారాయణ, రొక్కం త్రినాథ్‌, ఉల్లం రవి, జయరాజ్‌, న్యాయవాది వెన్న కుమారస్వామి, గుడాల ప్రసాద్‌, ఆదిలక్ష్మి, ప్రభాకర్‌, ఎం. శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here