మరో 24 గంటలు భారీ వర్షాలు 

0
57
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 23: కోస్తాంధ్రలో మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో గత రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం అతలాకుతలమైంది. గత రాత్రి వరకు నిరంతరాయంగా కురిసిన వర్షంతో నగరం తడిసి ముద్ద కాగా ఈ ఉదయమే కాస్త తెరిపినిచ్చింది. అప్పుడప్పుడు మబ్బులు కమ్ముతున్నా సూర్య కిరణాలు ప్రసరించేసరికి ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. పల్లపు ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్న నీటితో కంబాలచెరువు నిండుకుండలా మారగా వర్షాలు ఇలాగే కొనసాగితే మరింత ఉధృతి పెరిగి గట్టు తెగి ముంపునకు గురవుతామని పరిసర ప్రాంతాల వాసులు కలవరపడ్డారు. అయితే ఈ ఉదయం నుంచి వర్షం కాస్త తగ్గడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.