ప్రశాంతంగా బార్‌ కౌన్సిల్‌ ఎన్నికలు

0
22
రాజమహేంద్రవరం, జూన్‌ 29 : ఆంధ్రప్రదేశ్‌ బార్‌ కౌన్సిల్‌ ఎన్నికలు ఈరోజు ప్రశాంతంగా జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 135 కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతుండగా దాదాపు 22వేలమంది న్యాయవాదులు 25 మంది బార్‌ కౌన్సిల్‌ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంది. 25 సభ్యత్వ పదవులకు గాను 107 మంది అభ్యర్ధులు పోటీపడుతున్నారు. రాజమండ్రి బార్‌ అసోసియేషన్‌ హాలులో ఎన్నికల ప్రక్రియను నిర్వహించారు. బార్‌ కౌన్సిల్‌ సభ్యత్వం కలిగిన న్యాయవాదులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అందులో భాగంగా న్యాయవాది, గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ, తదితర ప్రముఖులు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here