పేదలకు పట్టెడన్నం పెట్టడమే ధ్యేయం

0
396
అన్న క్యాంటిన్ల ప్రారంభంలో ఉప ముఖ్యమంత్రి రాజప్ప
నగరంలో రెండవ దశలో మరో మూడు ఏర్పాటు : గోరంట్ల
ఎన్‌టిఆర్‌ బాటలో చంద్రబాబు పయనం : గన్ని కృష్ణ
రాజమహేంద్రవరం, జులై 11 : రాష్ట్రంలోని పేదలకు పట్టెడన్నం పెట్టేందుకే ‘అన్న క్యాంటిన్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని ఉప ముఖ్యమంత్రి  నిమ్మకాయల చిన రాజప్ప అన్నారు. నగరంలోని క్వారీ మార్కెట్‌ సెంటర్‌, లాలాచెరువు రోడ్డులోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన ‘అన్న క్యాంటీన్ల’ను రాజప్ప ఈరోజు ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్న ఎన్‌టిఆర్‌ పేదలను దృష్టిలో పెట్టుకుని రూ.2 కే కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారని, ఎన్‌టిఆర్‌ స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేదలకు పట్టెడన్నం పెట్టే లక్ష్యంతో అన్న క్యాంటిన్లును ప్రారంభించారని తెలిపారు. రాష్ట్రంలో తొలిసారిగా 35 పట్టణాలలో 100 క్యాంటిన్లను ఈరోజు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. మరి కొన్నిరోజులలో 75 పట్టణాలలో మరో 103 అన్న క్యాంటిన్లు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. తద్వారా సుమారుగా రెండు లక్షల మందికి పైగా పేదలకు నామ మాత్రపు ధరలకు ప్రతిరోజు భోజనం, టిఫిన్‌ అందించడం జరుగుతుందని తెలిపారు.  అన్న క్యాంటిన్లలో ప్రతి ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం, రాత్రి భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. పేదప్రజలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ నగరంలో పేద ప్రజలు ఎక్కువగా నివశించే ప్రాంతాలలో అన్న క్యాంటిన్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. పేదలకు ఇచ్చిన మాటకుకట్టుబడి వారికి కూడు, గూడు,గుడ్డ  కల్పించడం జరుగుతుందని అన్నారు. మొదటిదశలో నగరంలో రెండు క్యాంటిన్లు ఏర్పాటు చేయడం జరిగిందని రెండవ దశలో మరో మూడు క్యాంటిన్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ అవకాశాన్ని పేదలందరు ఉపయోగించుకోవాలని అన్నారు. సిటీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ రూ 5కే అన్నక్యాంటిన్‌ ద్వారా భోజనం అందించడంతో పేదలు లబ్దిపొందుతారని అన్నారు. అర్బన్‌ ప్రాంతంలో ఇటువంటి క్యాంటిన్‌ ఏర్పాటు చేయడం పేదలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని తెలిపారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ యన్‌.టి.ఆర్‌ తల పెట్టిన పేదవారికి అభివ ద్ధి కార్యక్రమాలు అన్నీ కొనసాగిస్తున్నామని తెలిపారు. నాణ్యమైన ఆహారం అందించడం జరుగుతుందని తెలిపారు. అతి తక్కువ ధరతో ఆహార పదార్థాలు అందించడం ఒకవరంగా భావించాలని అన్నారు. నగర మేయర్‌ పంతం రజనీ శేషసాయి మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికి పేదవానికి అన్నిసౌకర్యాలు ఏర్పాటు చేయడంవలన పేదలు ఎంతో లబ్ధి పొందుతున్నారని తెలిపారు. గుడా ఛైర్మన్‌ గన్ని క ష్ణ మాట్లాడుతూ పేదలకు కూడు, గూడు, గుడ్డ కల్పించడానికి దివంగత ఎన్‌టిఆర్‌ అనేక కార్యక్రమాలు అమలు చేశారని, ఆయన బాటలోనే పయనిస్తున్న చంద్రబాబు పేదలకు కిలో బియ్యం రూపాయికి అందించడంతో పాటు వారికి పక్కా గృహాలు నిర్మిస్తున్నారని, ఎన్నికల వాగ్ధానం మేరకు అన్న క్యాంటిన్లను ఏర్పాటు చేసి పేదలకు అతి తక్కువ ధరలకే ఆహార పదార్ధాలు అందిస్తున్నారని గన్ని అన్నారు. పేదవారు నివశించే ప్రాంతాలలో అన్న క్యాంటిన్లు బాగా ఉపయోగపడతాయని తెలిపారు. రాష్ట్రంలో అన్ని పట్టణాలలో అన్న క్యాంటిన్లు ఏర్పాటుచేయడం ద్వారా పేదలకు ఆహార భద్రత కల్పించడానికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. పేదలకు ఎన్నో అభివ ద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేయడం ద్వారా వారిని అన్నివిధాల ఆదుకుంటున్నామని అన్నారు. పెట్టుబడులకు అనువైన రాష్ట్రాల్లో ఏపీకి మొదటి స్ధానం దక్కడం వెనుక చంద్రబాబు నిర్విరామ కృషి ఉందని, విమర్శలతో అభివృద్ధిని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్న ప్రతిపక్షాలు దీనికి ఏం సమాధానం చెబుతాయని ఆయన ప్రశ్నించారు. అన్న క్యాంటినల్లో  ప్రతి ఉదయం టిఫిన్‌ 7.30 నుండి 10 గంటలవరకు, మధ్యాహ్నం భోజనం 12.30 నుండి 3 గంటవరకు, రాత్రి భోజనం 7.30 గంటల నుండి 9గంటల వరకు సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా అన్న క్యాంటిన్‌ ( క్వారీ సెంటర్‌)లో  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాజప్ప ఐదు రూపాయలు చెల్లించి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, కార్పొరేటర్లు, టిఎన్‌టియుసి జిల్లా అధ్యక్షుడు నక్కా చిట్టిబాబు, పబ్లిక్‌ హెల్త్‌ ఆఫీసర్‌ సుధాకర్‌, డి.ఇ. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here