వారం వారం కోర్టుకెళ్తూ మాపై విమర్శలా?

0
150
విజయ్‌సాయిరెడ్డిని అచ్చోసిన ఆంబోతులా వదిలేశారు
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతల తీరుపై రాజప్ప ధ్వజం
రాజమహేంద్రవరం, జులై 11 : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అవినీతిలో ఎంపీ విజయసాయిరెడ్డిదే ముఖ్యపాత్ర అని ఉప ముఖ్యమంత్రి, ¬ం మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప పేర్కొన్నారు. అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవానికి నగరానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా ధనాన్ని లూఠీ చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడి వారం వారం కోర్టు మెట్టులు ఎక్కుతున్న వారు ఇపుడు ఏమీ ఎరుగనట్లు నీతులు వల్లిస్తూ ఎదుటి వారిని వేలెత్తి చూపే స్థాయికి వచ్చారని ఎద్దేవా చేశారు. ‘అచ్చోసిన ఆంబోతిలా’ రోడ్లపై తిరగమని విజయసాయిరెడ్డిని వైకాపా అధినేత జగన్మోహన్‌ రెడ్డి వదిలేశారని ఆయన మండిపడ్డారు. ఎన్నికల ప్రయోజనాల కోసం తమ ప్రభుత్వం పనిచేయడం లేదని, నిరంతరం అభివృది,్ధ సంక్షేమమే లక్ష్యంతోనే నాలుగేళ్లుగా పాలన సాగిస్తున్నామని అన్నారు. జగన్మోహన్‌ రెడ్డి చేసిన లక్ష కోట్ల అవినీతిలో ఇప్పటికే 43 వేల కోట్ల అవినీతి బయటపడిందని, రాబోయే కాలంలో మిగిలిన అవినీతికి సంబంధించిన అంశాలు బయటకు వస్తాయని అన్నారు. 11 కేసుల్లో ఎ2గా ఉన్న విజయసాయిరెడ్డి వైకాపా అధినేత జగన్మోహన్‌ రెడ్డి అవినీతిలో ముఖ్యపాత్రదారుడని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి గడ్కరి పోలవరం ప్రాజెక్టు పరిశీలనపై ఆయన స్పందిస్తూ ప్రస్తుత పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టుకు రూ.10 వేల కోట్లు మంజూరు చేస్తే ప్రాజెక్టు పనులు మరింతగా వేగంగా ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుందని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here