నగర కాంగ్రెస్‌ కార్యదర్శిగా దేవానంద్‌

0
98
రాజమహేంద్రవరం, జులై 11 : నగర కాంగ్రెస్‌ కార్యదర్శిగా చర్చిపేటకు చెందిన పలివెల దేవానంద్‌ నియమితులయ్యారు. పార్టీలో చురుకుగా ఉంటూ క్రియాశీలక పాత్ర పోషిస్తున్న దేవానంద్‌ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషిచేస్తూ ప్రజా సమస్యలపై నిర్వహించిన ఉద్యమాలకు గుర్తింపుగా పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు ఈ నియామకం జరిపినట్లు నగర కాంగ్రెస్‌ అధ్యక్షులు ఎన్‌.వి.శ్రీనివాస్‌ తెలిపారు. ఎన్నికలు దగ్గరపడుతున్నందున పార్టీని బలోపేతం చేసే దిశగా దేవానంద్‌ కృషిచేయాలని ఆయన ఆకాంక్షించారు. దేవానంద్‌ నియామకం పట్ల నగర కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దేవానంద్‌ మాట్లాడుతూ తన సేవలను గుర్తించి నగర కాంగ్రెస్‌ కార్యదర్శిగా నియమించడం ఆనందంగా ఉందని, అయితే దీనిని బాధ్యతగా భావించి పార్టీ బలోపేతానికి కృషిచేస్తూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానన్నారు. ఈ సందర్భంగా నగర కాంగ్రెస్‌ అధ్యక్షులు ఎన్‌.వి.శ్రీనివాస్‌, పిసిసి సంయుక్త కార్యదర్శి కాటం రవి, ఉపాధ్యక్షుడు యేడిద జయప్రకాష్‌, పిసిసి నాయకులు బెజవాడ రంగా, అబ్దుల్లా షరీఫ్‌, జిల్లా సేవాదళ్‌ అధ్యక్షులు గోలి రవి, కుమార్‌ తదితరులకు దేవానంద్‌ కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here