రామకృష్ణ మిషన్‌కు మందులు అందజేత

0
83
రాజమహేంద్రవరం, జులై 12 : స్ధానిక గోదావరి గట్టున గల రామకృష్ణ మిషన్‌ ఆసుపత్రికి భవానీ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ తరపున రూ. 75వేలు విలువచేసే మందులను ట్రస్ట్‌ నిర్వాహకుడు ఆదిరెడ్డి వాసు అందజేసారు. ఆసుపత్రి ప్రాంగణంలో రామకృష్ణ మిషన్‌ రాజమహేంద్రవరం అధ్యక్షులు స్వామి వినిశ్వాసానంద ఈ మందులను సేకరించారు. ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ భవానీ ఛారిటబుల్‌ ట్రస్ట్‌, వెలమ యువత ఆధ్వర్యంలో నగరంలో అనేక వైద్య శిబిరాలను నిర్వహిస్తూ, ప్రజల ఆరోగ్యం కొరకు తమవంతు కృషి చేస్తున్నామన్నారు. పేద ప్రజలకు విశేషమైన వైద్య సేవలు అందిస్తున్న రామకృష్ణ మిషన్‌ ఆసుపత్రికి తమవంతు సహకారంగా మందులను అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో చలుమూరు శ్రీనివాస్‌, చల్లా కేశవ, డాక్టర్‌ యాళ్ళ ప్రదీఫ్‌, యిన్నమూరి ప్రదీప్‌, యాళ్ళ వెంకట్రావు, యాళ్ళ కుమారస్వామి, కొల్లి బుజ్జి, యాళ్ళ రవిబాబు, రాధాకృష్ణ, శ్యామ్‌, తేజ  పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here