దళిత సదస్సును జయప్రదం చేయండి

0
125
సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో ప్రచార జాత
రాజమహేంద్రవరం, జులై 12 : సామాజిక న్యాయం – దళితుల సంక్షేమం కోసం నూతన రాజకీయ ప్రత్యామ్నాయానికి కలిసిరండి అని పిలుపునిస్తూ సిపిఎం, సిపిఐల ఆధ్వర్యంలో ఈనెల 14న రాజమహేంద్రవరం రివర్‌బే ¬టల్‌లో నిర్వహిస్తున్న సదస్సును జయప్రదం చేయాలని కోరుతూ  ప్రచార జాత చేపట్టారు. ఈ ప్రచార జాతాను స్ధానిక గోకవరం బస్టాండ్‌  వద్దగల అంబేద్కర్‌ విగ్రహం వద్ద నుండి ప్రారంభించారు. ముందుగా సిపిఎం, సిపిఐ నాయకులు అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడతాం.. పోరాడతాం..!, సామాజిక న్యాయం.. దళిత సంక్షేమ కొరకు  పోరాడతాం.. పోరాడతాం..! అంటూ నినాదాలు చేసారు. జాతాను ఉద్దేశించి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దడాల సుబ్బారావు, జిల్లా కార్యదర్శి టి అరుణ్‌, సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధులు మాట్లాడారు.  సామాజిక న్యాయం – దళితుల సంక్షేమం కోసం నూతన రాజకీయ ప్రత్యామ్నాయం రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు టిఎస్‌ ప్రకాష్‌, పోలిన వెంకటేశ్వరరావు, ఎస్‌ఎస్‌ మూర్తి, పి. తులసి, బళ్ళా పూర్ణిమరాజు, పావనమూర్తి, రాజులోవ, పవన్‌, సిపిఐ నాయకులు నల్లా రామారావు, తోలక ప్రసాద్‌, నల్లా భ్రమరాంబ, సేపేని రమణమ్మ, దళిత నాయకులు ఆకుమర్తి చిన్న మాదిగ పాల్గొన్నారు. ఈ ప్రచార జాత నగరంలోని పలు ప్రాంతాల మీదుగా సాగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here